logo

కార్యరంగంలోకి దిగిన మంత్రులు

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నూతన మంత్రులకు మంత్రితత్వ శాఖలను కేటాయించడంతో ఆయాశాఖ మంత్రులు సోమవారం విధానసౌధ, వికాససౌధల్లో తమకు కేటాయించిన కార్యాలయాల్లో ఉన్నతాధికారుల సమావేశాల్లో నిమగ్నమయ్యారు.

Published : 30 May 2023 02:47 IST

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నూతన మంత్రులకు మంత్రితత్వ శాఖలను కేటాయించడంతో ఆయాశాఖ మంత్రులు సోమవారం విధానసౌధ, వికాససౌధల్లో తమకు కేటాయించిన కార్యాలయాల్లో ఉన్నతాధికారుల సమావేశాల్లో నిమగ్నమయ్యారు. శాఖలు కేటాయించిన తక్షణం కొందరు మంత్రులు అధికారులతో సమావేశాల్లో మునిగిపోయారు. ఆయా శాఖలపై అవగాహన కోసం సమావేశాలను నిర్వహించారు. రెవెన్యూశాఖ మంత్రి కృష్ణభైరేగౌడ, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రె, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే, తదితరులు అధికారుల సమావేశాల్లో తీరిక లేకుండా గడిపారు. శాఖ స్థితిగతులను గురించి అధ్యయనం చేశారు. అవినీతికి మారుపేరుగా ఉన్న రెవెన్యూ శాఖలో పరిపాలన సంస్కరణాలు తీసుకు వచ్చి అవినీతి నియంత్రణ చర్యలపై మంత్రి కృష్ణభైరేగౌడ దృష్టి సారించారు. వారికి ముందు బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, పాలికె కేంద్ర కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి రవాణా భవన్‌కు వెళ్లి అధికారులతో చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని