logo

జలవనరుల కలుషితంతో జలాచరులకు ముప్పు

జలవనరులు కలుషితమైతే అందులోని జలాచరుల ఉనికికే ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ ప్రేమికుడు, ఉపన్యాసకుడు డాక్టర్‌ సమ్మద్‌ కొట్టూరు పేర్కొన్నారు.

Published : 01 Jun 2023 03:51 IST

మాట్లాడుతున్న పర్యావరణ ప్రేమికుడు డాక్టర్‌ సమ్మద్‌ కొట్టూరు

హొసపేటె, న్యూస్‌టుడే: జలవనరులు కలుషితమైతే అందులోని జలాచరుల ఉనికికే ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ ప్రేమికుడు, ఉపన్యాసకుడు డాక్టర్‌ సమ్మద్‌ కొట్టూరు పేర్కొన్నారు. దరోజీ కరడిధామ ఆధ్వర్యంలో నరసాపుర ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రపంచ నీటిపిల్లులు(ఓటర్స్‌) దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తుంగభద్ర జలాశయం నుంచి కంప్లి వరకు 35 కిలోమీటర్‌ నదిలో పెద్ద సంఖ్యలో నీటిపిల్లులు నివసిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 2015లోనే నీటిపిల్లుల సంరక్షణ ప్రాంతంగా ప్రకటించిందని గుర్తు చేశారు. అప్పటినుంచి నదిలో ఇసుక తరలింపు, ప్రాణిపక్షుల వేటను అటవీశాఖ నిషేధించిందని అన్నారు. అపురూపమైన నీటిపిల్లుల సంరక్షణ మనందరి బాధ్యత అని గుర్తుచేశారు. వన్యప్రాణుల సంరక్షకుడు పంపయ్యస్వామి మళీమఠ మాట్లాడుతూ..విజయనగర జిల్లాలో చాలా అరుదైన ప్రాణి, పక్షిసంకులాలు ఉన్నాయి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది, జాగృతి కార్యక్రమాలు తరచూ ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను కోరారు. నీటిపిల్లులపై పరిశోధన చేసిన నిపుణురాలు సహన, పాముల సంరక్షకుడు వేణుగోపాల నాయుడు తదితరులు మాట్లాడారు. సహాయక అటవీ సంరక్షణాధికారి టి.భాస్కర్‌ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కరడిధామ ఆర్‌ఎఫ్‌ఓ ఎం.ఉషా, హొసూరు పంచాయతీ అధ్యక్షురాలు దురుగమ్మ, డీఆర్‌ఎఫ్‌ఓ జగదీశ్‌, విశ్వనాథ హిరేమని పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని