logo

కార్మికులకు చట్టబద్ధంగా సౌకర్యాలు

కార్మికులు చట్టబద్ధంగా అన్ని సౌకర్యాలు పొంది భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి రాజేశ్‌ ఎన్‌.హొసమని సూచించారు.

Published : 01 Jun 2023 03:51 IST

మాట్లాడుతున్న న్యాయమూర్తి రాజేశ్‌ ఎన్‌.హొసమని

బళ్లారి, న్యూస్‌టుడే: కార్మికులు చట్టబద్ధంగా అన్ని సౌకర్యాలు పొంది భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి రాజేశ్‌ ఎన్‌.హొసమని సూచించారు. జిల్లా యంత్రాంగం,  పంచాయతీ, న్యాయసేవా ప్రాధికార సంస్థ, న్యాయవాదుల సంఘం, కార్మిక సంఘాలు సంయుక్తంగా బళ్లారి తాలూకా హలకుంది గ్రామం సమీపంలోని వీఆర్‌కేపీ స్పాంజ్‌ పరిశ్రమలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని న్యాయమూర్తి ప్రారంభించి మాట్లాడారు. కార్మికులకు రక్షణ, సౌకర్యాలు కల్పించడమే కర్తవ్యంగా అంతర్జాతీయ స్థాయిలో కార్మిక దినోత్సవం జరుపుకొంటున్నట్లు వివరించారు. కార్మికశాఖాధికారి కమల్‌ షా అల్తాప్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ కార్మికులకు రక్షణ కల్పించేందుకు, వారి ప్రయోజనాలు పొందేందుకు సంఘటితం చేసేందుకు కొందరు పోరాటాలు చేస్తున్నారు. ఏటా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన చట్టాలను తెలుసుకుని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన అధికారి వేణుగోపాల్‌ కార్మికుల భవిష్యత్తు నిధిపై వివరించారు. అధికారులు రాజకుమార, మౌనేష్‌, అబ్దుల్‌ హపీజ్‌, సందీప్‌  హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని