logo

‘మోదీ తొమ్మిదేళ్ల పాలన సంతృప్తికరం’

ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన సంతృప్తిగా ఉంది..అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 02 Jun 2023 02:36 IST

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, చిత్రంలో ఎమ్మెల్సీ సతీశ్‌ ఏచరెడ్డి,
మాజీ శాసనసభ్యులు సోమశేఖర్‌రెడ్డి, ఎం.ఎస్‌.సోమలింగప్ప, డా.సుందర్‌, డా.అరుణ కామినేని, అనిల్‌ నాయుడు

బళ్లారి, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన సంతృప్తిగా ఉంది..అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12 ఏళ్లుగా నిలిచిపోయిన బళ్లారి-హొసపేటె వరకు వరకు ఉన్న 63వ జాతీయ రహదారిని తమ ప్రభుత్వంలో గతంలో గుత్తేదారుడికి కేటాయించిన పనులను రద్దు చేసి కొత్తగా రూ.830.28 కోట్లతో పనులను మరో గుత్తేదారుడికి అప్పగించారు. ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయి. 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉందన్నారు. రూ.103 కోట్లతో సుధాక్రాస్‌ వద్ద రైల్వే పైవంతెన టెండర్‌ ప్రక్రియ, బళ్లారి రైల్వేస్టేషన్‌లో లిప్ట్‌, ఎస్కలేటర్‌ పనులు జరుగుతున్నాయి. హొసపేటె రైల్వే స్టేషన్‌ను హంపీ మాదిరిగా నిర్మిస్తున్నారు. కుడతిని రహదారిపై ఉన్న రైల్వే వంతెన పనులు జరుగుతున్నాయి. సండూరు రైల్వే, బళ్లారి-రాయదుర్గం రైల్వే పనులు కూడా జరుగుతున్నాయి. కొత్తగా హుబ్బళ్లి నుంచి బళ్లారి మీదుగా, బెంగళూరుకు ఇంటర్‌ సిటీ రైళ్లు వేయాలని కోరినట్లు తెలిపారు. కూడ్లిగి తాలూకా చిక్కజోగిహళ్లిలో ఉన్న నవోదయ వసతి శాల విజయనగర జిల్లాకు చేరింది. ప్రస్తుతం బళ్లారి జిల్లాలో నవోదయ వసతిశాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన గరీబ్‌ కల్యాణ పథకం, స్వచ్ఛభారత్‌, పి.ఎం.స్వనిధి, ముద్రా పథకం, పక్కా గృహాలు నిర్మాణం, ప్రధాన మంత్రి ఆవాస్‌ పథకం, మట్టి పరీక్షల కోసం ఆరోగ్య కార్డులు, కనీస మద్దతు ధర, పి.ఎం.కిసాన్‌ పథకం ఎరువులు సరఫరా, ఫసల్‌ బీమా పథకం మహిళల అభివృద్ధికి వివిధ పనులు పథకాల గురించి వివరించారు.

గ్యారెంటీతో జనబలం ఓడిపోయింది.. విధానసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారెంటీ కార్డులతో జనబలం ఓడిపోయిందన్నారు. కొవిడ్‌ సందర్భంలో గరీబ్‌ పథకం కింద ఉచితంగా వితరణ చేసిన వాటిని మరిచి పోయి జనం కాంగ్రెస్‌ పార్టీ పరంగా నిలిచారు. గ్యారెంటీ కార్డుల ముందు జనబలం ఓడిపోయిందని లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప తెలిపారు. 2024 విధానసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలతో జూన్‌ 1న నుంచి ఇంటింటి సంపర్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి లోక్‌సభ క్షేత్రంలో 250 ప్రముఖ కుటుంబాలను కలుస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రచార సమితి బళ్లారి జిల్లా బాధ్యుడు చంద్రశేఖర్‌ పాటీల్‌ హలగేరిని నియమించామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌, మాజీ శాసనసభ్యులు గాలి సోమశేఖర్‌రెడ్డి, సోమలింగప్ప, డా.బి.కె.సుందర్‌, డా.అరుణ కామినేని, అనిల్‌నాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని