పిడుగులు పడి అపార నష్టం
కంప్లి తాలూకా ఎమ్మిగనూరు గ్రామ పంచాయతీ పరిధి తిమ్మనకెరె క్యాంపులో రైతు గాదిరాజు రామకృష్ణరాజు ఇంటి ఆవరణలో బుధవారం రాత్రి రెండు పిడుగులు పడ్డాయి.
పిడుగుపాటుకు బూడిదైన వరి గడ్డి
తిమ్మనకెరె క్యాంపు (కంప్లి), న్యూస్‌టుడే: కంప్లి తాలూకా ఎమ్మిగనూరు గ్రామ పంచాయతీ పరిధి తిమ్మనకెరె క్యాంపులో రైతు గాదిరాజు రామకృష్ణరాజు ఇంటి ఆవరణలో బుధవారం రాత్రి రెండు పిడుగులు పడ్డాయి. 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. కొద్దిసేపటికే ఇంటికి 40 అడుగుల దూరంలో ఓ పిడుగు పడి 20 ఎకరాల వరిగడ్డి దగ్ధమవుతుండగా వెంటనే మరో పిడుగు 30 అడుగుల దూరంలో పడి కొబ్బరి చెట్టు దగ్ధమైంది. ఆ సమయంలో ఇంటి బయట అరుగు మీద కూర్చున్న తనకు సైతం కొంత షాక్ తగిలిందని రామకృష్ణ రాజు తెలిపారు. మెరుపులు, పిడుగుల శబ్దానికి ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, ఇన్వర్టర్, తదితర వస్తువులు కాలిపోగా కిటికీల అద్దాలు పగిలిపోయాయి. 8 రోజుల కిందట ఆయన భార్య వెంకటసుబ్బలక్ష్మి మృతి చెందారు. మరో మూడు రోజుల్లో పెద్ద కర్మ ఉంది. ఈ కార్యానికి కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటికి వచ్చారు. పక్కనే పడిన పిడుగుల శబ్దానికి మహిళలు, పిల్లలు భయకంపితులయ్యారు. దాదాపు రూ.3 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని రామకృష్ణ రాజు తెలిపారు. విషయం తెలిసి గ్రామ లెక్కాధికారి వచ్చి నష్టం వివరాలు సేకరించారు.
దగ్ధమైన కొబ్బరిచెట్టు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)
-
Rahul Gandhi: నేను చెప్పింది మోదీ అంగీకరించారు: రాహుల్ గాంధీ
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!