logo

‘మేం పిరికివాళ్లం కాదు’

మేం పిరికివాళ్లం కాదు..మమ్మల్ని ఉపయోగించుకున్న గాలి జనార్దన్‌రెడ్డి నిజమైన పిరికివాడు అని మాజీ శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి మండిపడ్డారు.

Published : 02 Jun 2023 02:36 IST

విలేకరుల మాట్లాడుతున్న మాజీ శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి

బళ్లారి, న్యూస్‌టుడే: మేం పిరికివాళ్లం కాదు..మమ్మల్ని ఉపయోగించుకున్న గాలి జనార్దన్‌రెడ్డి నిజమైన పిరికివాడు అని మాజీ శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం స్థానిక సంగనకల్లు రహదారిలోని వాజ్‌పేయీ లే అవుట్‌లోని భాజపా కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాలి సోమశేఖర్‌రెడ్డి మాట్లాడారు. నేను పెంచిన పిరికివాళ్లు ఇంట్లో ఉన్నారు.. తాను సభకు వచ్చానని గాలి జనార్దన్‌రెడ్డి, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడిన దృశ్యాలు ఓ టీవీలో చూశాను. మాజీ మంత్రి బి.శ్రీరాములు, మాజీ శాసనసభ్యులు టి.హెచ్‌.సురేష్‌బాబు, సోమలింగప్ప పిరికివాళ్లా అని ప్రశ్నించారు. మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఎన్ని అక్రమాలకు పాల్పడి అక్రమాస్తులు సంపాదించారో ప్రపంచమంతటికీ తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలి జనార్దన్‌రెడ్డికి చిన్నప్పటి నుంచి ఓ గుణం ఉంది...ఎవరైనా తన కిందే ఉండాలని భావిస్తారు. ఆయన చెప్పేది అందరూ వినాలి. వినకుంటే అణగదొక్కడం తెలుసు..అందర్నీ తొక్కితొక్కి ఈ స్థాయికి చేరుకున్నారు. గతంలో జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ సభ్యులను కొనుగోలు చేసి గాలి కరుణాకర్‌రెడ్డిని గెలిపించుకున్నారు. ఈ విధానసభ ఎన్నికల్లోనూ భాజపా, కాంగ్రెస్‌ పార్టీలోని కొంత మందిని కొనుగోలు చేసి కె.ఆర్‌.పి.పి.పరంగా పనిచేయించుకున్నారని తెలిపారు. నాకు, కె.ఆర్‌.పి.పి. అభ్యర్థికి వచ్చిన ఓట్లు కలిపితే కాంగ్రెస్‌ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక్కడ కె.ఆర్‌.పి.పి. అభ్యర్థి లేకుంటే నేను 7వేల ఓట్లు ఆధిక్యతతో గెలుపొందేవాడినని తెలిపారు. తమ ఇంటి వారే ఓడించారని విచారం వ్యక్తం చేశారు. పార్టీ వీడే ఆలోచన ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు భాజపాలో ఉంటాను. నేను మృతిచెందిన తర్వాత కూడా నాపై భాజపా జెండా వేసి అంత్యక్రియలు నిర్వహించాలని కోరినట్లు స్పష్టం చేశారు. విధానసభ ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా పనిచేసిన కార్పొరేటర్లు కోనంకి తిలక్‌కుమార్‌, కె.ఎస్‌.అశోక్‌కుమార్‌, కల్పనకు పార్టీ తాఖీదులు జారీ చేసిందని, వారిపై పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని