logo

సాహితీవేత్త కుం.వీరభద్రప్పకు బెదిరింపు లేఖ

విజయగనర జిల్లా కొట్టూరు విశ్రాంత ఉపాధ్యాయుడు, సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కృతుడు కుం.వీరభద్రప్పకు అపరిచితుల నుంచి మరో బెదిరింపు లేఖ వచ్చింది.

Published : 02 Jun 2023 02:36 IST

కుం.వీరభద్రప్ప సాహితీవేత్త

హొసపేటె, న్యూస్‌టుడే: విజయగనర జిల్లా కొట్టూరు విశ్రాంత ఉపాధ్యాయుడు, సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కృతుడు కుం.వీరభద్రప్పకు అపరిచితుల నుంచి మరో బెదిరింపు లేఖ వచ్చింది. కొట్టూరులోని ఆయన చిరునామాకు బెదిరింపు లేఖ రావడంతో ఆయన కుటుంబంలో, ఆ ప్రాంతంలో కొంత ఆందోళన పరిస్థితి నెలకొంది. విషయం తెలిసిన వెంటనే ఆప్తులు ఆయన్ను కలిసి ధైర్యం నింపారు. ‘మీ జీవితం అధర్మంతో నిండి ఉంది, నేడు లేదా రేపైనా మీ అజ్ఞానం దీపం ఆరిపోవడం ఖాయమని చేతరాతితో ఉత్తరంలో పేర్కొన్నారు. ఇది నాకు అందిన 16వ బెదిరింపు లేఖ, అయినప్పటికీ దీనిని అంత సులువుగా పరిగణించడం లేదు, వెంటనే పోలీసులను కలిసి ఫిర్యాదు ఇస్తానని కుం.వీరభద్రప్ప పేర్కొన్నారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వ హయాంలో ఆయనకు 15 బెదిరింపు లేఖలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది ఆయనకు మొదటి బెదిరింపు లేఖ. చాలా కార్యక్రమంలో ఆయన హిందుపరమైన సంఘటనలపై విరుచుకుపడటం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని