logo

అప్పతో బొమ్మై సుదీర్ఘ చర్చలు

అధికారిక ‘కావేరి నివాసం’ నుంచి తను కట్టించుకున్న ‘ధవళగిరి’ నివాసానికి మారిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పతో తాజా మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం సమావేశమయ్యారు.

Published : 03 Jun 2023 01:06 IST

యడియూరప్పతో చర్చిస్తున్న బొమ్మై

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : అధికారిక ‘కావేరి నివాసం’ నుంచి తను కట్టించుకున్న ‘ధవళగిరి’ నివాసానికి మారిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పతో తాజా మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు, మంత్రివర్గం కూర్పు పూర్తయిన ఇప్పటి వరకు కమలనాథులు విపక్ష నాయకుడిని ఎన్నుకోలేకపోయారు. జనతాదళ్‌కు 19 మంది సభ్యులు ఉండగా, కుమారస్వామిని జేడీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నారు. కమలనాథులకు 66 మంది సభ్యులున్నా, ఓటమి భారం నుంచి ఇంకా బటయపడలేదు. శాసనభ సమావేశాలలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వాగ్దాటిని తట్టుకునేందుకు బలమైన నేతను ఎన్నుకోవాలని భాజపా యోచిస్తోంది. సంఘపరివార్‌ నేతలతోనూ బొమ్మై ఇప్పటికే ఒక విడుత చర్చలు జరిపినా ప్రయోజనం చేకూరలేదు. భాజపా అధ్యక్షుడు నళీన్‌ కుమార్‌ కటీల్‌ పదవీ కాలం గత జనవరితోనే పూర్తయింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే పార్టీకి రాష్ట్రాధ్యక్షుడు, విధానసభా నాయకుడి ఎన్నిక పూర్తి చేయాలని కేంద్ర నాయకులకు సిఫార్సు చేయాలని తీర్మానించారు. అధ్యక్షుని స్థానానికి సీటీ రవి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె, బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌, వి.సునీల్‌ కుమార్‌, ఎన్‌.రవికుమార్‌, అశ్వత్థనారాయణ, అరవింద బెల్లద్‌, బీవై విజయేంద్ర పేర్లు వినవస్తున్నాయి. శాసనసభలో ప్రభుత్వ తీరును ఎండగట్టే సమర్థవంతమైన నాయకుడు ఎవరు ఉండాలనే విషయం ఇప్పటికీ కొలిక్కి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని