logo

మఠాధిపతుల ముందడుగు

వీరశైవ లింగాయత సముదాయానికి రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చర్యలు తీసుకోవాలని ఆ సముదాయానికి చెందిన మఠాధిపతులు డిమాండు చేశారు.

Published : 03 Jun 2023 01:06 IST

సమావేశంలో వీరశైవ మఠాలకు చెందిన మఠాధిపతులు, వీరశైవ లింగాయత సముదాయం నేతలు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : వీరశైవ లింగాయత సముదాయానికి రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చర్యలు తీసుకోవాలని ఆ సముదాయానికి చెందిన మఠాధిపతులు డిమాండు చేశారు. వీరశైవ లింగాయత మఠాధిపతులు, మహాసభ ప్రతినిధులు శుక్రవారం బెంగళూరులో ప్రత్యేకంగా సమావేశమై గళం సవరించుకున్నారు. సమాజ ప్రజల హక్కుల పరిరక్షణకు స్వరం పెంచారు. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కేంద్రం ముందున్న సిఫార్సులను అములు చేయించేలా ముఖ్యమంత్రి, మంత్రులతో చర్చించాలని శుక్రవారం నిర్వహించిన సమావేశంలో తీర్మానం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని