logo

సాంకేతిక మార్పులు నిత్యనూతనం

పదేళ్ల కిందట వరకు సాంకేతిక పరిజ్ఞానం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాగా నేడు గ్రామీణ ప్రజలు సైతం అనివార్యంగా అవగాహన పెంచుకోవాల్సి వస్తోంది.

Published : 18 Sep 2023 00:22 IST

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కె.ఎం.సురేంద్రన్‌,  డా.హెచ్‌.సి.నాగరాజు తదితరులు

ఈనాడు, బెంగళూరు: పదేళ్ల కిందట వరకు సాంకేతిక పరిజ్ఞానం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాగా నేడు గ్రామీణ ప్రజలు సైతం అనివార్యంగా అవగాహన పెంచుకోవాల్సి వస్తోంది. రోజు రోజుకీ మారుతున్న సాంకేతికతపై సాధికారత ఉంటేనే పోటీ ప్రపంచంలో నిలబడగలమని టీసీఎస్‌ అకడమిక్‌ అలయన్సెస్‌ హెడ్‌ కె.ఎం.సురేంద్రన్‌ పేర్కొన్నారు. ఆయన బెంగళూరులోని ఎన్‌ఎంఐటీలో 2023-2027 బీఈ విద్యార్థుల ఓరియంటేషన్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులు రోజువారి పాఠ్యాంశాలతో నిత్యం మారుతున్న సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలన్నారు. బీఈ తొలి ఏడాదిలో ఆవిష్కరించిన సాంకేతిక కోర్సు ముగిసే నాటికి పాతబడి పోతోంది. నిత్యం వీటిపై పట్టు సాధించకపోతే పోటీ ప్రపంచంలో వెనుకబడి పోతారన్నారు. విద్యార్ధి దశలోనే అంకురాల స్థాపనపై అవగాహన, నవ్యాలోచనల పట్ల జాగృతి కల్గి ఉండాలన్నారు. 20147నాటికి అమృత్‌కాల్‌ సాకారం కావాలంటే సాంకేతిక విద్యార్థుల నవ్యాలోచనల, భారత ఆర్థికతకు దోహదపడే సాంకేతిక ఉత్పత్తులు కీలకంగా వ్యవహరిస్తాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన అమృత్‌ కాల్‌ పథకాలు ఇప్పటికే అమలు చేస్తుండగా, నైపుణ్యంతో కూడిన పరిశోధనలు భౌగోళిక సమస్యలకు పరిష్కారం చూపగలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటర్‌ రోహిత్‌ పూంజా, ప్రిన్సిపల్‌ డా.హెచ్‌.సి.నాగరాజ్‌,  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని