logo
Published : 04/12/2021 04:33 IST

కొవిడ్‌ రోగులకు బల సంవర్ధక ఆహారం నిలిపివేత

● గత నెల 25 నుంచే ఉత్తర్వు అమలులోకి..

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే

కొవిడ్‌ రెండో దశ సమయంలో జిల్లా ఆసుపత్రిలో పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న సిబ్బంది

కరోనాను జయించేందుకు బాధితుల్లో రోగనిరోధక శక్తి ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం దవాఖానాలోని కొవిడ్‌ వార్డుల్లో చేరిన రోగులకు పౌష్టికాహారాన్ని ప్రత్యేక మెనూగా అందజేసింది. రోగుల సంఖ్య క్రమంగా తగ్గుతూ రావడంతో గత నెల 25 నుంచి బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రులకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు పౌష్టికాహారం అందజేయాలని, బిల్లులు చెల్లిస్తామని వైద్య విధాన పరిషత్‌ 2020, జులై 15న ఉత్తర్వు సంఖ్య 298 జారీ చేసింది. దీనిని అనుసరించి కొత్తగూడెంలోని జిల్లా ఆసుపత్రితో పాటు ఇతర కేంద్రాలు, క్వారంటైన్‌ సెంటర్లలోని ఇన్‌ పేషంట్లకు ఒక్కొక్కరికి రోజుకు రూ.200 వ్యయంతో బలవర్ధక ఆహారాన్ని అందించారు. రోగులతో పాటు వారికి సేవలందించే వైద్యులు, నర్సులు, టెక్నికల్‌ సిబ్బందికి కూడా సదుపాయం వర్తింపజేశారు. కొద్ది నెలలుగా రెండో దశ ఐపీ కేసులు తగ్గుముఖం పట్టడంతో నవంబరు 25 నుంచి ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ కమిషనర్‌ ఆసుపత్రులకు ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌ చికిత్సలు పొందుతున్న వారికీ పౌష్టికాహారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే మెనూను తిరిగి అందజేసే అవకాశాలుంటాయని అందులో పేర్కొన్నారు. జిల్లాలోని ఆసుపత్రుల్లో గత వారం రోజులుగా నిర్ణయాన్ని అమలు చేయడం ప్రారంభించారు. అయినా ప్రస్తుతం పది మంది లోపు బాధితులు ఆసుపత్రుల్లో కొవిడ్‌ సేవలు పొందుతుండగా వారు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ రోగులకు అందించే డైట్‌నూ సక్రమంగా అందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వేలాది మందికి లబ్ధి

2020, జులై 15 నుంచి 2021, నవంబరు 24 వరకు జిల్లాలోని అన్ని దవాఖానాల్లో 66,225 మంది కొవిడ్‌ చికిత్స పొందారు. వీరిలో చాలా మంది ఇన్‌పేషంట్లుగా చేరారు. 2021, మార్చి తర్వాత బాధితుల తాకిడి అమాంతం పెరిగింది. ఏప్రిల్‌ నుంచి జులై మధ్య ఒక్కో ఆసుపత్రిలో 250 నుంచి 300 మంది వరకు చేరారు. మొత్తం రూ.కోటి వరకు వెచ్చించి పౌష్టికాహారాన్ని అందించినట్లు అంచనా.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని