logo

కేటీపీఎస్‌లో మద్యం తాగి పట్టుబడిన జేపీఏ

పాల్వంచ కేటీపీఎస్‌ ఐదు, ఆరు దశల్లోని కోల్‌ ప్లాంట్‌ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్‌ (జేపీఏ) బానోత్‌ శంకర్‌ మద్యం తాగి పట్టుబడ్డాడు. విజిలెన్స్‌ భద్రతా విభాగం విధులకు హాజరయ్యే సిబ్బందికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహిస్తుంటారు.

Published : 19 Jan 2022 05:37 IST

పాల్వంచ కేటీపీఎస్‌, న్యూస్‌టుడే: పాల్వంచ కేటీపీఎస్‌ ఐదు, ఆరు దశల్లోని కోల్‌ ప్లాంట్‌ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్‌ (జేపీఏ) బానోత్‌ శంకర్‌ మద్యం తాగి పట్టుబడ్డాడు. విజిలెన్స్‌ భద్రతా విభాగం విధులకు హాజరయ్యే సిబ్బందికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ నెల 16న సాయంత్రం విద్యుత్కేంద్రం ప్రధాన ద్వారం వద్ద నిర్వహించిన తనిఖీల్లో జేపీఏ శంకర్‌ మద్యం తాగినట్లు గుర్తించారు. సోమవారం నమూనాను కేటీపీఎస్‌ ఆసుపత్రికి పంపగా మంగళవారం ధ్రువీకరించారు. టీఎస్‌ జెన్కో విజిలెన్స్‌ ఎస్పీ వినోద్‌కుమార్‌ ఆదేశాల మేరకు విద్యుత్కేంద్రం అధికారులు నివేదిక పంపించారు. కర్మాగారం సీఈ కమతం రవీందర్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా విధులకు హాజరయ్యే ఉద్యోగులు మద్యం తాగి వస్తే సస్పెండ్‌ చేస్తామన్నారు. నివేదిక రాగానే శంకర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని