logo

ఏరియా ఆసుపత్రిలో పసికందు మృతి

భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. వివరాలు.. తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం తోటపల్లి గ్రామానికి చెందిన

Published : 19 Jan 2022 05:37 IST

మృత శిశువును పట్టుకుని ఆందోళన చేస్తున్న బంధువులు

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. వివరాలు.. తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం తోటపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న నిండు గర్భిణి. మొదటి కాన్పు కోసం మూడు రోజుల క్రితం భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో చేరారు. ఈనెల 16న శస్త్రచికిత్స ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జి కావాల్సి ఉండగా మంగళవారం పసికందు చనిపోయిందని సిబ్బంది చెప్పడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నా ఎందుకిలా జరిగిందంటూ మృత శిశువుతో ఆసుపత్రి వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు. అనారోగ్యం ఉంటే సకాలంలో గుర్తించి అవసరమైన చికిత్స ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. కామెర్లతో ఇలా అయిందని ప్రైవేటు వైద్యులు చెప్పేవరకు ఎందుకు స్పందించలేదని,  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సూపరింటెండెంట్‌ రామకృష్ణ మాట్లాడుతూ.. ఇందులో తమ నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని