logo

న్యాయంచేయాలంటూ.. వివాహిత దీక్ష

ముందే వివాహమైన విషయం చెప్పకుండా మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నాడని.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చి మొహం చాటేశాడని ఓ మహిళ కుమారుడితో కలిసి ఆందోళన చేపట్టింది. ఈ ఘటన సారపాకలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం..

Published : 19 Jan 2022 05:37 IST


చర్చి ఎదుట ఆందోళన చేపట్టిన మహిళ

బూర్గంపాడు, న్యూస్‌టుడే: ముందే వివాహమైన విషయం చెప్పకుండా మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నాడని.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చి మొహం చాటేశాడని ఓ మహిళ కుమారుడితో కలిసి ఆందోళన చేపట్టింది. ఈ ఘటన సారపాకలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతానికి చెందిన సువర్ణరాజు కొన్నేళ్లుగా సారపాకలోని ఓ చర్చిలో పాస్టర్‌గా పని చేస్తున్నాడు. చర్చి ఆవరణలో నివాసం ఉంటున్నాడు. పాతసారపాకకు చెందిన సులోచన అదే చర్చికి వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెను ఆమె తల్లిదండ్రుల సమక్షంలో 2008లో వివాహం చేసుకుని ఖమ్మంలో ఉంచాడు. వీరికి 2014లో ఓ బాబు జన్మించాడు. ఇటీవల మనస్పర్థలతో ఇద్దరూ విడిగా జీవించాలని నిర్ణయించుకున్నారు. పరిహారం చెల్లిస్తానని పెద్ద మనుషుల సమక్షంలో కాగితాలు రాసిచ్చిన సువర్ణరాజు కనిపించకుండా పోయాడని బాధితురాలు ఆరోపించారు. ముందే వివాహమై ఇద్దరు పిల్లలున్నా మోసం చేసి తనను రెండో వివాహం చేసుకున్నాడన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన పని చేసిన చర్చి ఎదుట కుమారుడితో కలిసి మంగళవారం బైఠాయించింది. తెదేపా, టీఎన్‌టీయూసీ, కాంగ్రెస్‌ నాయకులు ఘటనా స్థలికి చేరుకుని అండగా ఉంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని