విద్యుదాఘాతంతో రైతు మృతి
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
కొత్తపేట(నిజామాబాద్ గ్రామీణం), న్యూస్‌టుడే: నిజామాబాద్ మండలం కొత్తపేట(మల్కాపూర్) గ్రామానికి చెందిన నీరడి రాజయ్య(42) అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందారు. గ్రామీణ ఎస్సై లింబాద్రి వివరాల ప్రకారం.. తన వ్యవసాయ క్షేత్రంలో వరి సాగు చేస్తున్న రాజయ్య శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు పొలానికి నీరు పారించాలని వచ్చారు. బోరు వేసేందుకు మోటార్ స్విచ్ బోర్డును ముట్టుకోగానే విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో అక్కడికక్కడే మరణించారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.