logo

లక్షణాల్లేవని అలక్ష్యం

‘పెద్దగా బాధించే లక్షణాల్లేవు..  ఆసుపత్రుల్లోకి చేరాల్సిన అవసరం కూడా అంతగా లేదు.. వైరస్‌ పని దాదాపు అయిపోయినట్టే’ అంటూ కనబరుస్తున్న నిర్లక్ష్యం గత కొద్ది రోజులుగా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎగబాకేలా చేస్తున్నాయి.

Published : 25 Jan 2022 03:47 IST

నిర్లక్ష్యంతో కేసులు పైపైకి

కొత్తగూడెం జిల్లా ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కోసం నిరీక్షణ

కొత్తగూడెం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ‘పెద్దగా బాధించే లక్షణాల్లేవు..  ఆసుపత్రుల్లోకి చేరాల్సిన అవసరం కూడా అంతగా లేదు.. వైరస్‌ పని దాదాపు అయిపోయినట్టే’ అంటూ కనబరుస్తున్న నిర్లక్ష్యం గత కొద్ది రోజులుగా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎగబాకేలా చేస్తున్నాయి. దశ ఏదైనా.. ఈ ఏడాది ఇప్పటికే 2 వేలకు పాజిటివ్‌ కేసులు సమీపించడం గమనార్హం. జనవరి మొదటి రెండు వారాల్లో గరిష్ఠంగా 60  మంది బాధితులే నమోదయ్యారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 ఆరోగ్య కేంద్రాల్లో సగటున రోజుకు 2 వేల ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు జరుగుతున్నారు. ఆర్టీపీసీఆర్‌ విధానంలో మరో 400 మందికి పరీక్షిస్తున్నారు. గతంతో పోలిస్తే గత వారం రోజులుగా వరుసగా పాజిటివిటీ రేటు అమాంతం పెరుగుతూనే ఉంది. ఈ నెల 1 నుంచి 17వ వరకు 46,058 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 390 మందికి మాత్రమే వైరస్‌ నిర్ధారణ జరిగింది. 18 నుంచి 24 మధ్య  37,537కి గాను  1774 మంది అనుమానితులు వైరస్‌ బారినపడ్డారు.  పరీక్షలు పెంచిన కొద్దీ బాధితుల సంఖ్య పెరగడం జిల్లా అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. పెద్దగా లక్షణాల్లేవన్న అలసత్వం ఈ పరిస్థితి దారితీస్తుందని వైద్యారోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని