logo

మరో 432 మందికి పాజిటివ్‌

జిల్లావ్యాప్తంగా సోమవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 432 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 5,160 మంది నుంచి నమూనాలు సేకరించగా సింగరేణి ప్రధానాసుపత్రిలో 147,

Published : 25 Jan 2022 03:47 IST

భద్రాచలంలో సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా సోమవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 432 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 5,160 మంది నుంచి నమూనాలు సేకరించగా సింగరేణి ప్రధానాసుపత్రిలో 147, భద్రాచలం డివిజన్‌ ఆసుపత్రుల్లో 34, కొత్తగూడెం డివిజన్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో 251 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. నాలుగో రోజు జిల్లాలో నిర్వహించిన జ్వర సర్వేలో 1,074 సర్వే బృందాలు 17,546 గృహాలను సందర్శించాయి. జ్వర పీడితులుగా గుర్తించిన 1,216 మందికి హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేశారు. రోజువారీ వ్యాక్సినేషన్‌లో భాగంగా 15-17 ఏళ్ల లోపు వారికి 1,669, రెండో డోస్‌ 6,394,  ప్రికాషన్‌ డోస్‌ 1,005 మందికి అందజేశారు.
జ్వర సర్వేలో 152 కిట్లు పంపిణీ
భద్రాచలం, న్యూస్‌టుడే: పట్టణంలో మూడు రోజులుగా ఇంటింటి జ్వర సర్వే చురుగ్గా సాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం కాలనీలలో పర్యటించి అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు 3,472 గృహాలను సందర్శించి 10,472 మందికి అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. లక్షణాలు ఉన్న వారికి కౌన్సెలింగ్‌ చేసి 152 కిట్లు అందించినట్లు వివరించారు. ఇలాంటి తరుణంలో అలసత్వం వహిస్తే ఇబ్బంది తప్పదని హెచ్చరించారు. వీసాల కృష్ణయ్య, సద్గుణవాణి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని