logo

అభాగ్యులకు సంరక్షణ

అమ్మఒడికి దూరమైన పసికందులకు రక్షణగా నిలుస్తోంది ‘శిశుగృహ’. అభాగ్యులైన శిశువులను కాపాడేందుకు 2021, సెప్టెంబరులో భద్రాచలంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మేనేజర్‌, ఏఎన్‌ఎం, సామాజిక

Published : 25 Jan 2022 03:47 IST

కొత్తగూడెం పట్టణం, భద్రాచలం, న్యూస్‌టుడే

శిశుగృహలో రక్షణ పొందుతున్న పసికందులు

అమ్మఒడికి దూరమైన పసికందులకు రక్షణగా నిలుస్తోంది ‘శిశుగృహ’. అభాగ్యులైన శిశువులను కాపాడేందుకు 2021, సెప్టెంబరులో భద్రాచలంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మేనేజర్‌, ఏఎన్‌ఎం, సామాజిక కార్యకర్తతో పాటు ఆరుగురు ఆయాలు, కాపలాదారుడు సహా పది మంది సిబ్బంది శిశువుల రక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పటి వరకు 11 మంది చిన్నారులను చేరదీశారు. వీరిలో ఆరుగురిని అధికారికంగా దత్తత ఇచ్చారు. అప్పగింతకు ముందు బిడ్డల బంగారు భవిష్యత్తు లక్ష్యంగా దరఖాస్తుదారులను విచారిస్తున్నారు. అనంతరం జిల్లా ఫ్యామిలీ కోర్టు సమక్షంలో దత్తత ప్రక్రియ పూర్తిచేస్తున్నారు.
* ‘పిల్లలు, వారసులు లేరన్న సాకుతో అనధికారికంగా బిడ్డలను విక్రయించినా.. దత్తత తీసుకున్నా చట్టరీత్యా నేరం. అలా చేస్తే రెండు వర్గాలపైనా చట్టపరమైన చర్యలుంటాయి. అలాంటి సందర్భాల్లో చంటి బిడ్డలను శిశుగృహకు చేరుస్తున్నాం. ఒకవేళ సాకే స్థోమత లేదని అంగీకరించినా ఆయా పసికందుల సంరక్షణ బాధ్యతను మేమే స్వీకరిస్తున్నాం. ఎలాంటి సందర్భాల్లోనైనా శిశువులను రోడ్లు, పొదల పాల్జేయకుండా భద్రాచలంలోని కేంద్రంలో అప్పగిస్తే వివరాలను గోప్యంగా ఉంచుతామని’ జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని