logo

29న మాతా శిశు ఆసుపత్రిలో సేవలు ప్రారంభం

ఎట్టకేలకు మాతా, శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌) ప్రారంభ ముహూర్తం ఖరారైంది. అనేక నెలలుగా ఊగిసలాడిన సేవల ప్రారంభంపై ఇన్నాళ్లకు ఓ స్పష్టత వచ్చింది. ఈ నెల 29వ తేదీ నుంచి అధికారికంగా మాతా, శిశు వైద్య సేవలను

Published : 25 Jan 2022 03:47 IST

ఆసుపత్రి స్కానింగ్‌ గదిని పరిశీలిస్తున్న డీసీహెచ్‌ఎస్‌ డా.ముక్కంటేశ్వరరావు,

ప్రోగ్రాం అధికారి డి.సుజాత, రేడియాలజిస్టు విజయశ్రీ

కొత్తగూడెం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ఎట్టకేలకు మాతా, శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌) ప్రారంభ ముహూర్తం ఖరారైంది. అనేక నెలలుగా ఊగిసలాడిన సేవల ప్రారంభంపై ఇన్నాళ్లకు ఓ స్పష్టత వచ్చింది. ఈ నెల 29వ తేదీ నుంచి అధికారికంగా మాతా, శిశు వైద్య సేవలను నూతనంగా నిర్మించిన భవనంలో కొనసాగించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో తొలిసారిగా అత్యాధునికమైన ‘టిఫ్పా’ స్కానింగ్‌ యంత్రాన్ని ఎంసీహెచ్‌లో సోమవారం ఇన్‌స్టాల్‌ చేశారు. గర్భిణులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ యంత్రం పనితీరును జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డా.మందడపు ముక్కంటేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ జేవీఎల్‌ శిరీష, ఎంసీహెచ్‌ ప్రోగ్రాం అధికారి డి.సుజాత, రేడియాలజిస్టు విజయశ్రీ, భావ్‌సింగ్‌ బృందం పరిశీలించింది. చిన్నారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్మర్స్‌, ఫొటోథెరపీ పరికరాల పనితీరును పర్యవేక్షించింది. మరోవైపు ఆసుపత్రిలో అవసరమైన పడకలను సైతం సిద్ధం చేశారు. వైద్యులు, సిబ్బంది, స్కానింగ్‌, ఔషధాల పంపిణీ, ఓపీ చిట్టీ ఇతరత్రా సేవా విభాగాల ఏర్పాటు పూర్తయింది. ఇతర సాంకేతికపరమైన అంశాలపై డీసీహెచ్‌ఎస్‌ ఆరా తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు