logo

జప్తు ఘటనలు బాధించాయి..

‘రుణాల వసూళ్లలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఘటనలు బాధ కలిగించాయి. ఇళ్లకు తాళాలు వేయటం, బియ్యం తదితర సామగ్రి బయట వేయటం లాంటివి జరగకుండా ఉండాల్సింద’ని డీసీసీబీ

Published : 25 Jan 2022 03:47 IST

‘ఈనాడు’ కథనానికి స్పందించిన రాష్ట్ర సహకార బ్యాంకు ఎండీ 

సమావేశంలో మాట్లాడుతున్న ఛైర్మన్‌ నాగభూషయ్య, పక్కనే సీఈవో వీరబాబు

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ‘రుణాల వసూళ్లలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఘటనలు బాధ కలిగించాయి. ఇళ్లకు తాళాలు వేయటం, బియ్యం తదితర సామగ్రి బయట వేయటం లాంటివి జరగకుండా ఉండాల్సింద’ని డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య అన్నారు. ‘బ్యాంకు జప్తులతో బెంబేలు’ శీర్షికన 23న ’ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర సహకార బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ నేతి మురళీధర్‌రావు స్పందించారు. ప్రజలకు బ్యాంకు పట్ల వ్యతిరేక భావం లేకుండా ఉండేందుకు వెంటనే పత్రికా సమావేశం ఏర్పాటుచేసి వివరణ ఇవ్వాల్సిందిగా డీసీసీబీని కోరారు. ఈనేపథ్యంలో సోమవారం ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జేఎల్‌జీ రుణాల వసూళ్ల విషయంలో కామేపల్లి, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో జరిగిన ఘటనలు ఆవేదన కలిగించాయని చెప్పారు. ఏడేళ్లయినా వసూలు కాకుండా మొండి బకాయిలుగా మారిన నేపథ్యంలో బ్యాంకు అధికారులు కొంత కఠినంగా వ్యవహరించారన్నారు. మాఫీ అవుతాయనే ఉద్దేశంతో చాలా మంది చెల్లించటం లేదని, ఇప్పటికైనా వెంటనే చెల్లించి సహకరించాలని కోరారు. పేదలకు ఇచ్చిన జేఎల్‌జీ రుణాల విషయంలో కొంత సమయం ఇవ్వాలని బ్యాంకు అధికారులను ఆదేశించినట్లు  చెప్పారు. డీసీసీబీ సీఈవో అట్లూరి వీరబాబు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని