logo

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా బరండా అటవీ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. బరండా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని

Published : 25 Jan 2022 04:06 IST

స్వాధీనం చేసుకున్న మృతదేహం, సామగ్రి

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా బరండా అటవీ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. బరండా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నారాయణపూర్‌ జిల్లా కేంద్రానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో కిస్కోడో ఏరియా కమిటీకి చెందిన కొంతమంది మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులకు సమాచారం అందింది. డీఆర్జీ(డిస్ట్రిక్ట్‌ రిజర్వు గార్డ్‌) బలగాలు ఆదివారం అర్ధరాత్రి కూంబింగ్‌ చేస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు తుపాకీ తూటాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు సంబంధించిన తుపాకీ, 3 కిలోల ఐఈడీ బాంబులు, ట్యాబ్లెట్లు, బ్యానర్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.

* సుక్మా జిల్లాలోని పూల్‌పగాడీ ప్రాంతానికి చెందిన ముగ్గురు మావోయిస్టు నాయకులు సోమవారం జిల్లా ఎస్పీ సునీల్‌శర్మ, సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు