logo

కదిలిన యంత్రాంగం

ములకలపల్లి మండలం సాకివాగు ఘటనపై అధికారులు స్పందించారు. సాగివాగు గ్రామానికి చెందిన బాలికలు, మహిళలపై అటవీ శాఖ ఎఫ్‌బీఓ మహేష్‌ దాడి చేసిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో సోమవారం ఐసీడీఎస్‌, ఐటీడీఏ

Published : 25 Jan 2022 04:06 IST

సాకివాగు ఘటనపై  ఐసీడీఎస్‌, ఐటీడీఏ విచారణ

వివరాలు నమోదు చేసుకుంటున్న ఐసీడీఎస్‌ అధికారులు

ములకలపల్లి, న్యూస్‌టుడే: ములకలపల్లి మండలం సాకివాగు ఘటనపై అధికారులు స్పందించారు. సాగివాగు గ్రామానికి చెందిన బాలికలు, మహిళలపై అటవీ శాఖ ఎఫ్‌బీఓ మహేష్‌ దాడి చేసిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో సోమవారం ఐసీడీఎస్‌, ఐటీడీఏ అధికారులు వేర్వేరుగా గ్రామంలో బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఉదయం ఐసీడీఎస్‌ అధికారులు, సఖీ, చైల్డ్‌లైన్‌ 1098 సభ్యులు బాధితుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించి, వారిపై దాడి విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజు, డి.టి. శ్రీనివాస్‌, స్థానిక ఆర్‌ఐ పద్మావతి సాగివాగులో బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు ఇరు శాఖల అధికారులు వెల్లడించారు. స్థానిక సర్పంచి గణపతి, ఎంపీటీసీ సభ్యులు విజయ, సరోజ, ఐసీడీఎస్‌ సీడీపీఓ రేవతి, డీసీపీఓ హరికుమారి, చైల్డ్‌లైన్‌ సమన్వయకర్త రాజ్‌కుమార్‌, సిబ్బంది సుమలత, బషీర్‌, సఖీ అడ్మిన్‌ శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు.
పోక్సో కేసు నమోదు చేయాలి
బాలికలపై దాడికి పాల్పడిన ఎఫ్‌బీఓపై పోక్సో కేసు నమోదు చేయాలని పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి సింగు ఉపేందర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం సంఘం నిజనిర్ధారణ బృందం గ్రామంలో పర్యటించింది. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఉపాధ్యక్షుడు ఉమా మహేశ్వరరావు, గౌని నాగేశ్వరరావు, సాగర్‌, మురళి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని