logo

పీవీకే-5 గనిని సందర్శించిన డీడీఎంఎస్‌

గనుల రక్షణ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ (ఎలక్ట్రికల్‌) బదరీష్‌కుమార్‌ సోమవారం పీవీకే-5 గనిలో పర్యటించారు. గనిలోని సర్ఫేస్‌ ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. భూగర్భగని లోపల ఉన్న హెచ్‌టీ, పంప్‌, స్విచ్‌ స్టేషన్లతో పాటు హాలర్‌ను తనిఖీ

Published : 25 Jan 2022 04:06 IST

గనిలోకి దిగుతున్న డీడీఎంఎస్‌ బదరీష్‌కుమార్‌, చిత్రంలో ఏరియా ఇంజినీర్‌

రఘురామిరెడ్డి, మేనేజర్‌ శ్రీనివాస్‌, సేఫ్టీ అధికారి భాస్కర్‌రావు తదితరులు

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: గనుల రక్షణ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ (ఎలక్ట్రికల్‌) బదరీష్‌కుమార్‌ సోమవారం పీవీకే-5 గనిలో పర్యటించారు. గనిలోని సర్ఫేస్‌ ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. భూగర్భగని లోపల ఉన్న హెచ్‌టీ, పంప్‌, స్విచ్‌ స్టేషన్లతో పాటు హాలర్‌ను తనిఖీ చేశారు. విద్యుత్తు వినియోగంలో తీసుకొంటున్న రక్షణ చర్యలపై సిబ్బందిని ప్రశ్నించారు. రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జరిగిన ఈ పర్యటనలో ఏరియా ఇంజినీర్‌ రఘురామిరెడ్డి, ఏఎస్‌ఓ బీవీఎస్‌ శర్మ, గని మేనేజర్‌ పాలడుగు శ్రీనివాస్‌, సేఫ్టీ ఆఫీసర్‌ భాస్కర్‌రావు, పిట్ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని