logo

ఆర్టీసీ ఆదాయానికి కరోనా దెబ్బ

కొవిడ్‌ మహమ్మారి మూడో దశ విజృంభణ అన్ని రంగాలను కుదేలు చేస్తోంది. ఈ ప్రభావం ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీపై కూడా పడింది. కరోనా వ్యాప్తికి భయపడి ప్రజలు ప్రయాణాలను తగ్గించుకుంటున్నారు.

Published : 25 Jan 2022 04:29 IST

ఖమ్మం మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే

ఖమ్మం బస్టాండులో అంతంత మాత్రంగానే ప్రయాణికులు

కొవిడ్‌ మహమ్మారి మూడో దశ విజృంభణ అన్ని రంగాలను కుదేలు చేస్తోంది. ఈ ప్రభావం ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీపై కూడా పడింది. కరోనా వ్యాప్తికి భయపడి ప్రజలు ప్రయాణాలను తగ్గించుకుంటున్నారు. అత్యవసర ప్రయాణాలకు తమ సొంత వాహనాలను ఉపయోగించుకుంటున్నారు. గతంలో ప్రాంగణాలు ప్రయాణికులతో సందడిగా ఉండేవి. గత పదిరోజులుగా ప్రయాణ ప్రాంగణాలు కళ తప్పాయి. దాంతో ఖమ్మం రీజియన్‌లోని ఆరు డిపోల పరిధిలోనూ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఈనెల 10వ తేదీ వరకు ఆదాయం రోజుకు సుమారు రూ.83 లక్షల వరకు రాగా, ప్రస్తుతం అది రూ.58లక్షలకు పడిపోయింది. ఈపీకే  రూ.30.98 నుంచి రూ. 25.98 తగ్గిపోయింది.
కళ తప్పిన ప్రాంగణాలు
బస్టాండ్లలోనూ ప్రయాణికులు పలుచగా కనిపిస్తున్నారు. కుర్చీలన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఆర్టీసీలో ఇప్పటికే సిబ్బంది, ఉద్యోగులకు కరోనా టీకా రెండు డోసులు పూర్తయ్యాయి. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు మహమ్మారి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదాయం పడిపోవడంతో అసలే నష్టాల్లో ఉన్న సంస్థకు కరోనా దెబ్బతో కోలుకునే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని