logo

చిత్రవార్తలు

కూటికోసం కోటి తిప్పలు తప్పడం లేదు. బస్సులో వెళ్తే ఛార్జీల భారంతోపాటు, గ్యాసుబండ తీసుకెళ్లేందుకు అనుమతులుండవు. దీంతో చేసేదేమీ లేక తమకున్న ద్విచక్రవాహనంపై ఇనుప మంచాన్ని కట్టుకొని దానిపై గ్యాసుబండను పెట్టుకొని తమ చంటి

Published : 27 Jan 2022 04:07 IST

బతుకు తిప్పలు.. తప్పని ప్రయాణం

కూటికోసం కోటి తిప్పలు తప్పడం లేదు. బస్సులో వెళ్తే ఛార్జీల భారంతోపాటు, గ్యాసుబండ తీసుకెళ్లేందుకు అనుమతులుండవు. దీంతో చేసేదేమీ లేక తమకున్న ద్విచక్రవాహనంపై ఇనుప మంచాన్ని కట్టుకొని దానిపై గ్యాసుబండను పెట్టుకొని తమ చంటి బిడ్డను ఒడిలో కూర్చోపెట్టుకొని భార్యాపిల్లలతో ప్రయాణించారు. ఖమ్మం శివారు ప్రాంతం నుంచి సూర్యాపేట దగ్గరలో ఓ ఇటుక బట్టీలో పనిచేసేందుకు వలస వెళ్తున్న వారి చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ బుధవారం తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం రహదారిపై తన ఛాయాగ్రాహకంలో బంధించింది.

- న్యూస్‌టుడే, తిరుమలాయపాలెం


తీరా దగ్గరికెళ్తే.. ఒళ్లు జల్లు!

నిత్యం భారీ వాహనాలు దూసుకెళ్లే జాతీయ రహదారి మార్జిన్‌ ప్రమాదకరంగా తయారైంది.  కొత్తగూడెం శివారు లక్ష్మీదేవిపల్లి పంచాయతీ పరిధిలోని ఆర్‌ అండ్‌ బీ వంతెన ఆనుకుని రోడ్డు ధ్వంసమైంది. తీరా దగ్గరకు వచ్చి చూస్తే గానీ అక్కడ అంచు దెబ్బతిన్నట్లు కనిపించడం లేదు. ఏ మాత్రం మార్జిన్‌ దిగినా పక్కనున్న వాగులోకి వాహనాలు దూసుకెళ్లేలా పరిస్థితులు నెలకొన్నాయి. ఇల్లెందు క్రాస్‌ రోడ్డు, పాల్వంచ వైపు నుంచి విజయవాడ, ఖమ్మం వైపు వెళ్లే పలు వాహనాలు ఈ మార్గం మీదుగా వస్తుంటాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న మార్గంలో ప్రమాదాలకు తావులేకుండా సమస్యను పరిష్కరించి రక్షణ గోడ ఏర్పాటు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.

మార్జిన్‌లో ప్రమాదకరంగా ఉన్న రోడ్డు

- కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని