logo

పార్టీ బలోపేతానికి కృషి

జిల్లాలో తెరాసని మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తానని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన అనంతరం గురువారం సాయంత్రం ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

Published : 28 Jan 2022 05:14 IST

తెరాస జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌


జిల్లా తెరాస కార్యాలయానికి వచ్చిన తాతా మధుసూధన్‌కు స్వాగతం పలుకుతున్న డీసీసీబీ అధ్యక్షుడు కూరాకుల, నల్లమల , నాగరాజు, మురళి

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: జిల్లాలో తెరాసని మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తానని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన అనంతరం గురువారం సాయంత్రం ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీనాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ల ఆశీర్వాదంతో కొత్తగా అప్పగించిన బాధ్యతలను, పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తానన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధి చేస్తానన్నారు.  ఫిబ్రవరిలో పార్టీ కీలక సమావేశం ఉంటుందని, అందులో మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. స్వాగతం పలికిన వారిలో డీసీసీబీ ఛైర్మన్‌ నాగభూషయ్య, రైసస జిల్లా సమన్వయకర్త వెంకటేశ్వరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు  కృష్ణచైతన్య, తెరాస నగర అధ్యక్షుడు నాగరాజు, కార్పొరేటర్‌లు మురళి, దండా జ్యోతిరెడ్డి, షేక్‌ మగ్బుల్‌, నాయకులు కోసూరి రమేష్‌గౌడ్‌, సుంకర నరసింహారావు, అంజిరెడ్డి, కృష్ణ ఉన్నారు.

కూసుమంచి, న్యూస్‌టుడే: తెరాస జిల్లా అధ్యక్ష హోదాలో తొలిసారిగా గురువారం జిల్లాకు వచ్చిన తాతా మధుసూదన్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జిల్లా సరిహద్దు ప్రాంతమైన నాయకన్‌గూడెం, పాలేరు, కూసుమంచి, జీళ్లచెర్వుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ  స్వాగతం పలికారు. కూసుమంచి సెంటర్లో కార్యకర్తలు బాణసంచా కాల్చారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. నాయకన్‌గూడెం నుంచి ఖమ్మం వరకు వాహనాల శ్రేణి కొనసాగింది. జడ్పీ ఉపాధ్యక్షురాలు  ధనలక్ష్మి,  ఎంపీపీలు శ్రీనివాస్‌, మంగీలాల్‌, డీసీసీబీ సభ్యుడు   శేఖర్‌, నాయకులు బాలకృష్ణారెడ్డి, ఆసిఫ్‌ పాషా, వేణు,వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని