logo

నిరంతర పర్యవేక్షణతోనే మొక్కల సంరక్షణ

మొక్కల సంరక్షణ అనేది నిరంతర చర్యలో భాగం కావాలని కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి ఆయన ‘హరితహారం’,  అవెన్యూ ప్లాంటేషన్‌, పారిశుద్ధ్యం, ఇంటి పన్నుల వసూళ్లు, ఉపాధి హామీ పనులు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలపై వీడియో

Published : 28 Jan 2022 05:14 IST

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: మొక్కల సంరక్షణ అనేది నిరంతర చర్యలో భాగం కావాలని కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి ఆయన ‘హరితహారం’,  అవెన్యూ ప్లాంటేషన్‌, పారిశుద్ధ్యం, ఇంటి పన్నుల వసూళ్లు, ఉపాధి హామీ పనులు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బృహత్‌ వనాల్లో డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేయాలని,  77 శాతం మాత్రమే పూర్తయిన ఇంటి పన్నుల వసూళ్లు శతశాతానికి చేరాలని కలెక్టర్‌ ఆదేశించారు. నర్సరీల్లో మొక్కల పెంపకం, విత్తనాలు నాటే ప్రక్రియపై సమీక్షించారు. కొవిడ్‌ రెండో దశ వ్యాక్సిన్‌ పంపిణీని వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, జడ్పీ సీఈఓ విద్యాలత, డీపీఓ రమాకాంత్‌, డీపీవోలు హరిప్రసాద్‌ (కొత్తగూడెం), పవన్‌ (భద్రాచలం), ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని