logo

రాఘవ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు నేటికి వాయిదా

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాల్వంచ మండిగ నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతం కేసులో ఏ2గా ఉన్న వనమా రాఘవేందర్‌రావు అలియాస్‌ రాఘవ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు శుక్రవారానికి(నేటికి) వాయిదా పడింది. బెయిల్‌ మంజూరు చేయాలనే పిటిషన్‌పై

Published : 28 Jan 2022 05:14 IST

కొత్తగూడెం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాల్వంచ మండిగ నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతం కేసులో ఏ2గా ఉన్న వనమా రాఘవేందర్‌రావు అలియాస్‌ రాఘవ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు శుక్రవారానికి(నేటికి) వాయిదా పడింది. బెయిల్‌ మంజూరు చేయాలనే పిటిషన్‌పై కొత్తగూడెం అయిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో గురువారం వాదనలు కొనసాగాయి. నిందితుడి తరఫు న్యాయవాది లక్కినేని సత్యనారాయణ తన వాదనలు వినిపిస్తూ.. ‘ఎమ్మెల్యే తనయుడైన రాఘవ కూతురి వివాహ సంబంధం మాట్లాడేందుకు అబ్బాయి తరఫు బంధువులు వస్తున్నారు. త్వరలో ముహూర్తాలు పెట్టుకుంటారు. ఆయన తల్లిదండ్రులు, భార్యకు అనారోగ్య సమస్యలున్నాయి. వీటన్నింటి దృష్ట్యా కనీసం కండీషన్‌ బెయిల్‌ మంజూరు చేయాలని’ న్యాయమూర్తిని అభ్యర్థించారు. అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోసాని రాధాకృష్ణమూర్తి వాదిస్తూ ముద్దాయి బయటకు వస్తే సాక్షులపై ప్రభావం పడుతుందని, దర్యాప్తు పూర్తికానందున బెయిల్‌ మంజూరు సరికాదన్నారు. ఇప్పటి వరకు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక రాలేదన్నారు. ముద్దాయిపై మరో 12 పాత కేసులు సైతం పెండింగ్‌లో ఉన్నాయని ప్రతి వాదన వినిపించారు. 45 నిమిషాల పాటు ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ తీర్పును నేటికి రిజర్వు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని