logo

కేటీపీఎస్‌ ఆరో దశలో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ

పాల్వంచ కేటీపీఎస్‌ ఆరో దశ 500 మెగావాట్ల సామర్థ్యం గల 11వ యూనిట్‌లో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ గురువారం జరిగింది. తెల్లవారుజామున 2.45 గంటలకు రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. గతేడాది డిసెంబరు 8న కర్మాగారంలో వార్షిక మరమ్మతులు ప్రారంభించారు.

Published : 28 Jan 2022 05:21 IST

పాల్వంచ కేటీపీఎస్‌, న్యూస్‌టుడే: పాల్వంచ కేటీపీఎస్‌ ఆరో దశ 500 మెగావాట్ల సామర్థ్యం గల 11వ యూనిట్‌లో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ గురువారం జరిగింది. తెల్లవారుజామున 2.45 గంటలకు రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. గతేడాది డిసెంబరు 8న కర్మాగారంలో వార్షిక మరమ్మతులు ప్రారంభించారు. బీహెచ్‌ఈఎల్‌, ప్లాంట్‌ ఇంజినీర్లు, ఆర్టిజన్లు, ఉద్యోగులు సంయుక్తంగా ఈ పనులు నిర్వహించారు. కొవిడ్‌ కష్టకాలంలోనూ అనుకున్న సమయంలో, ప్రణాళిక ప్రకారం ప్లాంటు ప్రారంభించారు. రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టిన వార్షిక మరమ్మతులు విజయవంతంగా పూర్తిచేయడంతో సీఈ రవీందర్‌కుమార్‌, యూనిట్‌ ఎస్‌ఈ అనిల్‌కుమార్‌, ఇంజినీర్లు, ఉద్యోగులకు టీఎస్‌ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, థర్మల్‌ డైరెక్టర్‌ లక్ష్మయ్య నుంచి ప్రశంసలు దక్కాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు