logo

‘రాజీవ్‌ స్వగృహ’ డిపాజిట్లు వాపస్‌

పోలేపల్లి రెవెన్యూలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ ఇళ్ల సముదాయానికి డిపాజిట్లు చెల్లించిన వారి నగదును డిపాజిట్‌దారులకు అధికారులు తిరిగి ఇచ్చేస్తున్నారు. గురువారం రాజీవ్‌ స్వగృహ ఇళ్ల సముదాయం వద్ద డిపాజిట్‌దారుల నుంచి రసీదు,

Published : 28 Jan 2022 05:21 IST

తమ డిపాజిట్‌లను వెనక్కి తీసుకోవడానికి వచ్చిన డిపాజిట్‌దారులు

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: పోలేపల్లి రెవెన్యూలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ ఇళ్ల సముదాయానికి డిపాజిట్లు చెల్లించిన వారి నగదును డిపాజిట్‌దారులకు అధికారులు తిరిగి ఇచ్చేస్తున్నారు. గురువారం రాజీవ్‌ స్వగృహ ఇళ్ల సముదాయం వద్ద డిపాజిట్‌దారుల నుంచి రసీదు, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్‌ను తీసుకుంటున్నారు. డిపాజిట్‌గా చెల్లించిన రూ.3 వేల నగదును వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు రాజీవ్‌ స్వగృహ బాధ్యులు వెంకటరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

నాడు డిపాజిట్ల స్వీకరణ: నాడు ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల నుంచి ఒక్కో ఇంటికి రూ.3 వేల చొప్పున 3,600 మంది వద్ద డిపాజిట్లు స్వీకరించారు. నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,300 ఖర్చు అవుతుందని ఒక్కో చ.అడుగు స్థలం రూ.1,800కు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమయానికి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయకపోవటంతో కొంతమంది డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం ఇళ్లను విక్రయిస్తుండటంతో మిగిలినవీ ఇచ్చేస్తున్నారు. గురువారం 140 మందికి డిపాజిట్‌లను ఇచ్చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని