logo

సంక్షేమానికి చిరునామాగా తెలంగాణ: మంత్రి హరీశ్‌రావు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో సంక్షేమానికి చిరునామాగా దేశంలోనే తెలంగాణ నిలిచిందని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సత్తుపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శనివారం ఆయన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

Updated : 30 Jan 2022 06:25 IST

నూతన ప్రభుత్వ ఆసుపత్రి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి హరీశ్‌రావు, పక్కన మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే సండ్ర, ఎంపీ నామా, కలెక్టర్‌ గౌతమ్‌ తదితరులు

సత్తుపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో సంక్షేమానికి చిరునామాగా దేశంలోనే తెలంగాణ నిలిచిందని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సత్తుపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శనివారం ఆయన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ప్రారంభించారు. నారాయణపురంలో షిరిడిసాయి జనమంగళం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించనున్న 250 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి భవనం,  సత్తుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో రూ.34 కోట్లతో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే సండ్ర కోరిక మేరకు సీఎం వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేశారన్నారు. రూ.29 కోట్లతో నూతన భవనం నిర్మించుకుని మరో రూ.5 కోట్లతో అసరమైన అధునాతన పరికరాలు సమకూర్చడం, ఆసుపత్రికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది, సదుపాయలు, సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఖమ్మంలో క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రితోపాటు సత్తుపల్లి, మధిర ప్రాంతాల్లో వంద పడకల ఆస్పత్రులు రావడం సంతోషంగా ఉందన్నారు. వైద్య, ఆరోగ్యంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని ఇందులో భాగంగానే జిల్లా కేంద్రాల్లో ఐసీయూ కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ప్రభుత్వం రంగంలో ఎక్కడ చేయని విధంగా డయాలసిస్‌లో సింగిల్‌యూస్‌ ఫిల్టర్‌తో ఉచితంగా వైద్యం అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దీనిని ఆదర్శంగా తీసుకొన్నారన్నారు. వ్యాక్సినేషన్‌లో రాష్ట్రంలో కరీంనగర్‌ జిల్లా ప్రథమ, ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు.

* ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ సత్తుపల్లిలో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలను ప్రారంభించే గొప్ప భాగ్యం దక్కిందన్నారు. తెరాస ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతోపాటు వైద్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అడిగిన వెంటనే ఆసుపత్రి, అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, సహకరించిన మంత్రి అజయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తలసేమియా, ఫైలేరియా రోగులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. కార్యక్రమాల్లో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాసరావు, కలెక్టర్‌ గౌతమ్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ మహేశ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఉమామహేశ్వరరావు, ఎంపీపీ హైమావతి, జడ్పీటీసీ రామారావు, ఆత్మ ఛైర్మన్‌ హరికృష్ణారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌వో మాలతి, జిల్లా మెడికల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సూర్యనారాయణ, సూపరింటెండెంట్‌ కె.వెంకటేశ్వర్లు, కమిషనర్‌ సుజాత పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని