logo

పీహెచ్‌డీ ప్రవేశాలకు మార్గం సుగమం

నాలుగేళ్లుగా నలుగుతున్న పీహెచ్‌డీ ప్రవేశాలపైన కేయూ ఉన్నతాధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫ్యాకల్టీల డీన్‌లతో చర్చించిన అనంతరం కేయూనే ప్రవేశపరీక్ష

Updated : 19 May 2022 05:39 IST

న్యూస్‌టుడే, కేయూ క్యాంపస్‌: నాలుగేళ్లుగా నలుగుతున్న పీహెచ్‌డీ ప్రవేశాలపైన కేయూ ఉన్నతాధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫ్యాకల్టీల డీన్‌లతో చర్చించిన అనంతరం కేయూనే ప్రవేశపరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్‌ నిర్ణయించారు. ఈ మేరకు సంబంధించిన దస్త్రంపై బుధవారం రాత్రి సంతకం చేశారు.

రెండు విభాగాలుగా..: పీహెచ్‌డీ ప్రవేశాలను రెండు కేటగిరీలుగా విభజించారు. ఒకటో కేటగిరి ఎంఫిల్‌ పూర్తిచేసిన వారితో పాటు నెట్, స్లెట్, గేట్‌లో ఉత్తీర్ణులైన వారికి నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం ఏడాది కిందటనే దరఖాస్తులు ఆహ్వానించారు.  

ప్రకటన విడుదల..: కేయూలోని 47 కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. వచ్చేనెల 6వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి. రూ.500ల ఆలస్యం రుసుముతో 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. పూర్తి వివరాలను కేయూ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య బి.వెంకట్రాంరెడ్డి చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని