logo

వేసవి సెలవుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని, జీవో నం.317 చర్యలతో ఇతర జిల్లాలకు వెళ్లిన ఉపాధ్యాయుల భార్యాభర్తల, పరస్పర

Published : 19 May 2022 05:19 IST

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని, జీవో నం.317 చర్యలతో ఇతర జిల్లాలకు వెళ్లిన ఉపాధ్యాయుల భార్యాభర్తల, పరస్పర బదిలీల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కమిటీ భాగస్వామ్య సంఘాలైన టీపీటీఎఫ్‌, టీఎస్‌ యూటీఎఫ్‌, ఎస్‌టీఎఫ్‌, టీఎస్‌పీటీఏల జిల్లా అధ్యక్షులు వి.వెంకటేశ్వరరావు, జీవీ నాగమల్లేశ్వరరావు, యాదగిరి, రాంసింగ్‌ల అధ్యక్షతన ఆందోళన జరిగింది. ఆయా సంఘాల రాష్ట్ర నాయకులు చావా రవి, దేవరకొండ సైదులు, పి.నాగిరెడ్డి, సయ్యద్‌ షౌకత్‌ఆలీ, రామారావు  పాల్గొన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చావా రవి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్‌ రూపొందించకుండా బదిలీలు, ఉద్యోగోన్నతులను వాయిదా వేస్తోందన్నారు.ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని ఇతర జిల్లాలకు వెళ్లిన భార్యభర్తల కేసులు, పరస్పర బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మే పూర్తి కావస్తున్నా ఇంత వరకు సెడ్యూల్‌ విడుదల చేయలేదని, వెంటనే చర్యలు తీసుకోకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు ఆవుల అశోక్‌,  ఎస్‌.విజయ్‌, పి.నాగేశ్వరరావు, మల్లూరు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని