logo

రేకుల ఇల్లుకు.. రూ.7 లక్షల బిల్లు!

మూడు గదుల రేకుల ఇల్లు.. ఓ ఫ్యాన్‌, టీవీ, రెండు విద్యుత్తు బల్బులు... బిల్లు చూస్తే రూ.7,02,825! ఇదేమిటని అడిగితే సమాధానమివ్వని బిల్లు కలెక్టర్‌. ఇదీ..

Updated : 19 May 2022 12:03 IST

 కొత్తగూడెం గ్రామీణం, న్యూస్‌టుడే: మూడు గదుల రేకుల ఇల్లు.. ఓ ఫ్యాన్‌, టీవీ, రెండు విద్యుత్తు బల్బులు... బిల్లు చూస్తే రూ.7,02,825! ఇదేమిటని అడిగితే సమాధానమివ్వని బిల్లు కలెక్టర్‌. ఇదీ.. లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీకాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్‌కు ఇటీవల ఎదురైన అనుభవం. ఆయన నివాసానికి సంబంధించి మీటరుకు మే నెలలో అక్షరాలా రూ.7.02 లక్షల బిల్లు రావడంతో అవాక్కయ్యాడు. ఏప్రిల్‌ వరకు నెలకు సగటున రూ.400 వరకు బిల్లు వచ్చేది. ఇదేంది సారూ.. ఎలా సరిదిద్దుతారు? అని అడిగేందుకు స్థానిక బిల్లు కలెక్టర్‌ను సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వకుండా దాటేస్తున్నారని సంపత్‌ వాపోయారు. తప్పుల తడక బిల్లులతో హైరానా పెట్టడం సరికాదని.. అధికారులు బిల్లు సరిచేయాలని బాధిత వినియోగదారుడు కోరుతున్నాడు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని