logo

జేవీఆర్‌ ఓసీని సందర్శించిన ఎన్విరాన్మెంట్‌ డైరెక్టర్‌

స్థానిక జేవీఆర్‌ ఓసీని ఆదివారం హైదరాబాద్‌కు చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్మెంట్‌, ఫారెస్ట్‌, క్లైమెట్‌ చేంజ్‌ ఇంటిగ్రేటెడ్‌ రీజినల్‌ ఆఫీస్‌ డైరెక్టర్‌ కె.తరుణ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఓసీలో పర్యావరణ సమతుల్యతకు సంస్థ చేపడుతున్న

Published : 23 May 2022 05:42 IST


ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న తరుణ్‌

సత్తుపల్లి, న్యూస్‌టుడే: స్థానిక జేవీఆర్‌ ఓసీని ఆదివారం హైదరాబాద్‌కు చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్మెంట్‌, ఫారెస్ట్‌, క్లైమెట్‌ చేంజ్‌ ఇంటిగ్రేటెడ్‌ రీజినల్‌ ఆఫీస్‌ డైరెక్టర్‌ కె.తరుణ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఓసీలో పర్యావరణ సమతుల్యతకు సంస్థ చేపడుతున్న చర్యలను పరిశీలించారు. వెంగళరావునగర్‌లో ఆర్‌పీ అండ్‌ ఎన్‌సీఆర్‌ఏపీలో భాగంగా రూ.9లక్షలతో వెంగళరావునగర్‌లో నిర్మించిన ఆర్‌వో ప్లాంట్‌ను జీఎం నరసింహారావు, పీవో వెంకటాచారితో కలిపి ప్రారంభించారు. అనంతరం వేంసూరు రోడ్డులోని నీలాద్రి అర్బన్‌పార్కును సందర్శించారు. వీరి వెంట సైంటిస్ట్‌ పంకజ్‌, జనరల్‌ మేనేజర్‌ గణపతి, ఎస్‌వోటు జీఎం ఆర్‌.నారాయణరావు, ఏరియా ఇంజినీర్‌ రఘురామిరెడ్డి, ఏజీఎం టి.సూర్యనారాయణ, డీజీఎం సామ్యూల్‌ సుధాకర్‌, ప్రహ్లాద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని