logo

మానవ అక్రమ రవాణాపట్ల అప్రమత్తంగా ఉండాలి

రైళ్లలో మానవ అక్రమ రవాణాపట్ల అప్రమత్తంగా ఉండాలని ఐఆర్‌పీఎఫ్‌ఎస్‌ సికింద్రాబాదు డివిజన్‌ సీనియర్‌ డివిజన్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఎస్‌.సుధాకర్‌ సూచించారు. మానవ అక్రమ రవాణాపై ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగిన సమన్వయ

Published : 23 May 2022 05:42 IST

ఖమ్మం అర్బన్‌, న్యూస్‌టుడే: రైళ్లలో మానవ అక్రమ రవాణాపట్ల అప్రమత్తంగా ఉండాలని ఐఆర్‌పీఎఫ్‌ఎస్‌ సికింద్రాబాదు డివిజన్‌ సీనియర్‌ డివిజన్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఎస్‌.సుధాకర్‌ సూచించారు. మానవ అక్రమ రవాణాపై ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైల్వేలో నేరాల అదుపు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఖమ్మం ఆర్పీఎఫ్‌, రైల్వే చైల్డ్‌లైన్‌ ఆధ్వర్యంలో 2019 నుంచి నేటి వరకు 350 మంది పిల్లలను, జిల్లా చైల్డ్‌లైన్‌ సహకారంతో 29 మంది పిల్లలను రక్షించామని, ఇంటి వద్ద చెప్పకుండా వచ్చిన ఎంతో మంది మహిళలను వారి బంధువులకు, సఖి కేంద్రాలకు అప్పగించామని స్థానిక అధికారులు ఆయనకు వివరించారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, సీసీఎస్‌ సీఐ నవీన్‌, ఎస్‌ఎంఆర్‌ ప్రసాద్‌, ఎస్‌ఐలు వెంకటరెడ్డి, శ్రీనివాసగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని