logo

రెండేళ్ల తర్వాత ప్రత్యక్షం

రెండేళ్ల విరామం తర్వాత ప్రత్యక్ష పద్ధతిలో జరిగే పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ కారణంగా 2019-20 విద్యాసంవత్సరం ముగింపు పరీక్షలు జరగలేదు. 2020-21 విద్యాసంవత్సరానికి కూడా అసలు జరగలేదు.

Published : 23 May 2022 05:42 IST
నేటి నుంచే పది పరీక్షలు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే

రెండేళ్ల విరామం తర్వాత ప్రత్యక్ష పద్ధతిలో జరిగే పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ కారణంగా 2019-20 విద్యాసంవత్సరం ముగింపు పరీక్షలు జరగలేదు. 2020-21 విద్యాసంవత్సరానికి కూడా అసలు జరగలేదు. 2020-21 విద్యా సంవత్సరం కూడా ఆలస్యంగా గత సెప్టెంబరులో ప్రారంభమైంది. రెండేళ్లపాటు తరగతులు సాగక పోవటంతో ప్రస్తుత పదో తరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావటంతో తక్కువ సమయంలోనే పూర్తి స్థాయిలో పరీక్షలకు సన్నద్ధత కావాల్సి వచ్చింది. భౌతికంగా, మానసికంగా చదువులపై దృష్టి పెట్టే పరిస్థితి లేకున్నా వాటికి ఎదురీది పది పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. రెండేళ్లుగా పరీక్షలు లేకపోవటం, ఇప్పుడు ఏకంగా పది పరీక్షలు రాయాల్సి రావటం విద్యార్థులకు కష్టతరంగా మారింది. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా మండు వేసవిలో పరీక్షల నిర్వహణతో విద్యార్థులకు అసలు పరీక్ష మొదలైనట్లయ్యింది. సిలబస్‌ తగ్గించటంతో పాటు 11 పరీక్షలను ఏడుకు తగ్గించటం, ఛాయిస్‌ పెంచటం, ప్రత్యేక తరగతులు నిర్వహించటం లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసి తద్వారా విద్యార్థుల్లో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నట్లు డీఈవో ఎస్‌.యాదయ్య, డీసీఈబీ కార్యదర్శి కనపర్తి వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు తగిన వాతావరణం కల్పించినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని