logo

దళితుల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి: కలెక్టర్‌

దళితుల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషిచేశారని కలెక్టర్‌ డి.అనుదీప్‌ అన్నారు. ఆయన సంస్కరణాభిలాష నేటి సమాజానికి దిక్సూచిగా నిలుస్తుందని కొనియాడారు. భాగ్యరెడ్డివర్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్‌ నివాళులర్పించారు.

Published : 23 May 2022 05:45 IST


భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ డి.అనుదీప్‌

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: దళితుల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషిచేశారని కలెక్టర్‌ డి.అనుదీప్‌ అన్నారు. ఆయన సంస్కరణాభిలాష నేటి సమాజానికి దిక్సూచిగా నిలుస్తుందని కొనియాడారు. భాగ్యరెడ్డివర్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్‌ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అణగారిన వర్గాల ఉన్నతికి విద్యాభివృద్ధే మార్గమని భాగ్యరెడ్డి బస్తీల్లో రాత్రి పాఠశాలలు ప్రారంభించారన్నారు. హైదరాబాద్‌ ఇసామియా బజార్‌లో 1910లోనే దళిత బాలికలకు తెలుగు మాధ్యమ పాఠశాల ప్రారంభించినట్లు చెప్పారు. సాంఘిక దురాచారాలపై ప్రజా చైతన్యానికి కృషిచేశారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ అభివృద్ధి అధికారి అనసూర్య, మైనారిటీ సంక్షేమ అధికారి సంజీవరావు, భూగర్భ జలవనరుల శాఖ అధికారి బాలు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవి శంకర్‌, కలెక్టరేట్‌ ఏఓ గన్యా, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, శివభాస్కర్‌ పాల్గొన్నారు.

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి

‘పది’ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిని లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్‌ డి.అనుదీప్‌ సూచించారు. ఉజ్వల భవిష్యత్తు కోసం మంచి గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న పరీక్షలను ఆందోళనతో కాకుండా ఆత్మవిశ్వాసంతో రాయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. చూచిరాతలకు పాల్పడి జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని, తల్లిదండ్రులు సైతం తెలియజెప్పాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని