logo

ఈకేవైసీ పూర్తిచేస్తేనే ఖాతాల్లోకి నగదు

‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకం కింద రూ.6 వేల సాయం ఖాతాల్లో జమ కావాలంటే రైతులతో ‘ఈకేవైసీ (ఎలక్ట్రానిక్‌-నో యువర్‌ కస్టమర్‌) ప్రక్రియ పూర్తిచేయించాలని అధికారులకు ఆదేశాలందాయి.

Published : 23 May 2022 05:48 IST
మిగిలిన ‘పీఎం కిసాన్‌’ లబ్ధిదారులు 57 వేల మంది
కొత్తగూడెం వ్యవసాయం, న్యూస్‌టుడే

‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకం కింద రూ.6 వేల సాయం ఖాతాల్లో జమ కావాలంటే రైతులతో ‘ఈకేవైసీ (ఎలక్ట్రానిక్‌-నో యువర్‌ కస్టమర్‌) ప్రక్రియ పూర్తిచేయించాలని అధికారులకు ఆదేశాలందాయి. కొంతమంది లబ్ధిదారులు ఆధార్‌ లింక్‌ చేసినా బ్యాంకు ఖాతా వివరాలకు చరవాణి నంబర్లు అనుసంధానం చేయించలేదు. మరణించిన వారి వివరాలూ జిల్లాస్థాయి అధికారులు పరిశీలించి తొలగించలేదు. ఈ సమస్యలతో అనర్హులకు సైతం నిధులు జమవుతున్నాయి. దీనికి చెక్‌ పెట్టేందుకు ‘ఈకేవైసీ’ తప్పనిసరి చేశారు. ‘పీఎం కిసాన్‌ పోర్టల్‌’, ‘పీఎం కిసాన్‌ యాప్‌’లలో నేరుగా లబ్ధిదారులే నేరుగా స్మార్ట్‌ఫోన్లలో ఓటీపీ సాయంతో వివరాలు పొందుపరిచే అవకాశం ఉంది. ఈ వెసులుబాటు లేనివారు సీఎస్‌సీ(కామన్‌ సర్వీస్‌ సెంటర్‌), మీ సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్‌ ద్వారా అనుసంధానం చేసుకోవచ్ఛు ఇందుకోసం గడువు ఈ నెల 31 వరకు ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ పేర్కొంది.


స్పందించిన వారు 12 వేల మందే..

జిల్లాలోని 22 మండలాల్లో ఆధార్‌ అనుసంధానం కలిగి ఉన్న పథకం లబ్ధిదారులు 69,095 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 12,193 మంది మాత్రమే ఈకేవైసీ ప్రక్రియ పూర్తిచేసుకున్నారు. ఇంకా ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సిన వారు 56,902 మంది ఉన్నారు. తాజా నిబంధనపై ఏజెన్సీ, పల్లెల్లోని పేద రైతులకు పెద్దగా అవగాహన లేదు. ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించిన వారిలో సుమారు 7 వేల మంది సీఎస్సీ, మీ సేవా కేంద్రాలపైనే ఆధారపడ్డారు. మిగిలిన వారూ గడువులోగా స్పందించకపోతే ఏటా కేంద్రం 3 విడతల్లో అందజేసే రూ.6 వేల సాయం దక్కకుండా పోతుంది.


చరవాణిలో పూర్తిచేస్తే..

‘పీఎం కిసాన్‌’ వెబ్‌పోర్టల్‌లో సొంతంగా వివరాలు నమోదు చేయదలచిన వారు ముఖ్య విషయాన్ని గమనించాలి. వెబ్‌సైట్‌ తెరిచిన తర్వాత ‘ఫార్మర్‌ కార్నర్‌’లో సూచించిన ‘ఈ-కేవైసీ’ ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి. ఆధార్‌, ఫోన్‌ నంబరుకు వచ్చిన ఓటీపీ (వన్‌టైం పాస్‌వర్డ్‌) నమోదు చేసిన తర్వాత ‘ఈకేవైసీ సక్సెస్‌’ అని రావాలి. లేదంటే ప్రక్రియ పూర్తికానట్లు భావించాలి. ఆధార్‌, ఫోన్‌ నంబరు లింక్‌ చేయించని వారు సమీప సీఎస్‌సీ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ ద్వారా నమోదు చేయించుకోవచ్ఛు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని