logo

రాజకీయ వలస పక్షుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

జిల్లాకు ఐదేళ్లకొకసారి వస్తున్న రాజకీయ వలస పక్షుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

Published : 24 May 2022 02:07 IST

సహపంక్తి భోజనాలు చేస్తున్న అజయ్‌కుమార్‌

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: జిల్లాకు ఐదేళ్లకొకసారి వస్తున్న రాజకీయ వలస పక్షుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన వైద్యునికి పార్టీ టికెట్‌ ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు దండుకొని ఆయన మరణానికి కారణమైన నేతలు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సుదీర్ఘకాలం జిల్లా ప్రజలు ఆశీర్వదించి పదవులు అప్పగిస్తే అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకొని నాయకులు పెద్ద కళ్లజోళ్లు పెట్టుకొని రచ్చబండ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అజయ్‌కుమార్‌కు బ్రేకులు వేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. కుంభకోణాల కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర అందరికి తెలుసన్న విషయం ఆ పార్టీ నేతలు గుర్తించాలన్నారు. ఎన్ని బ్రేకులు వేసిన కేసీఆర్‌ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆపలేరన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రవాణా శాఖలో 15 ఏళ్ల దాటిన వాహనాలను తుక్కు కింద నెట్టివేస్తారని, రాజకీయాల్లో తుప్పు పట్టిన నేతలను నెట్టివేసేందుకు ఓ చట్టాన్ని తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 7,024మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల ద్వారా రూ.66.36కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, మేయర్‌ పునుకొల్లు నీరజ, డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మిప్రసన్న, జడ్పీటీసీ ప్రియాంక, ఎంపీపీ గౌరి, తహసీల్ధార్‌ శైలజ, కార్పొరేటర్‌లు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని