logo

కారుణ్య నియామకాలకు చర్యలు చేపట్టాలి : కలెక్టర్

జిల్లాలో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు శాఖల వారీగా నివేదికలు రెండ్రోజుల్లో అందించాలని కలెక్టర్‌ అధికారుల ఆదేశించారు. సోమవారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

Published : 24 May 2022 02:07 IST

ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ అనుదీప్‌

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు శాఖల వారీగా నివేదికలు రెండ్రోజుల్లో అందించాలని కలెక్టర్‌ అధికారుల ఆదేశించారు. సోమవారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  పూర్తయిన రెండు పడకల గదుల ఇళ్ల పంపిణీ, ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. జూన్‌ 3 నుంచి ప్రారంభం కానున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై ఈ నెల 30న పాల్వంచ సుగుణ గార్డెన్స్‌లో సన్నాహక సమావేశం ఉంటుందన్నారు. జీఓ 58 ప్రకారం ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల విచారణను ప్రత్యేకాధికారులు మంగళవారం నుంచి చేపట్టాలన్నారు. ‘మన ఊరు- మన బడి’ పథకంలో భాగంగా 321 పాఠశాలల పనులకు పరిపాలన అనుమతులు జారీచేసినట్లు చెపట్టారు. దళితబంధు లబ్ధిదారులకు యూనిట్ల మంజూరు వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 1500 యూనిట్లు మంజూరు చేయనున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. త్వరలో జరిగే దిశ సమావేశానికి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని డీఆర్‌డీవో మధుసూదనరాజును ఆదేశించారు.

కలెక్టర్‌బీ రాష్ట్ర అవతరణ వేడుకలు జూన్‌ 2న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో తొలుత ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా ప్రగతి మైదానంలో శాఖల వారీగా అభివృద్ధి పనులపై స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సాయంత్రం కొత్తగూడెం క్లబ్‌లో కవి సమ్మేళనానికి ఏర్పాట్లు చేయాలని డీపీఆర్వో శీలం శ్రీనివాసరావు, డీఈవో సోమశేఖరశర్మకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని