logo

గిరిజన సంక్షేమం కోసం చొరవ చూపండి: పీవో

భద్రాచలం మన్యంలోని గిరిజనుల సంక్షేమం కోసం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఐటీడీఏ పీవో గౌతమ్‌ ఆదేశించారు. తన కార్యాలయంలో సోమవారం దర్బారు నిర్వహించారు.

Published : 24 May 2022 02:24 IST

ప్రజా సమస్యలు వింటున్న పీవో గౌతమ్‌

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం మన్యంలోని గిరిజనుల సంక్షేమం కోసం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఐటీడీఏ పీవో గౌతమ్‌ ఆదేశించారు. తన కార్యాలయంలో సోమవారం దర్బారు నిర్వహించారు. గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిశీలన నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వినతి పత్రాలు అందిస్తున్నందున వాటిని పరిష్కరించేందుకు శ్రద్ధ చూపించాలని పేర్కొన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, వ్యవసాయ అవసరాలకు విద్యుత్తు, బోరు వంటి వాటిని మంజూరు చేయాలని దరఖాస్తులు వస్తున్నాóŸని వివరించారు. ట్రైకార్‌ ద్వారా అర్హులకు పథకాల ఫలాలు అందించాలని చెప్పారు. ప్రతీ విజ్ఞప్తిని ఇక్కడ ప్రత్యేక రిజిష్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఐటీడీఏలోని కొన్ని విభాగాలను పరిశీలించి నిర్వహణ తీరును పర్యవేక్షించారు. రికార్డు గదుల్లో జాగ్రత్తలు పాటించాలని దిశ నిర్దేశం చేశారు. ప్రత్యేకమైన పుస్తకాల నిమిత్తం గ్రంథాలయం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఏపీవో జనరల్‌ డేవిడ్‌రాజ్‌, మేనేజర్‌ ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని