logo

రైతుకు సంజీవని వరంగల్‌ డిక్లరేషన్‌: మల్లు రవి

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో ప్రకటించిన వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ కష్టాల్లో ఉన్న కర్షకలకు పాలిట ఓ సంజీవని అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీ ఎంపీ

Published : 25 May 2022 01:44 IST

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ మల్లు రవి

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో ప్రకటించిన వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ కష్టాల్లో ఉన్న కర్షకలకు పాలిట ఓ సంజీవని అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. ఖమ్మం డీసీసీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో రైతులకు వరంగల్‌ రైతు డిక్లరేషన్‌పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించిన చరిత్ర తెరాస ప్రభుత్వానికి దక్కిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ హయాంలో విత్తనాలకు, పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చామని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు నూరుశాతం రాయితీ ఇచ్చి ప్రోత్సహించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వంచిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు ఒకరోజు ధర్నా చేసి తర్వాత మేమే కొంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

బాధిత రైతు కుటుంబాలను ఆదుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక్కడి ప్రజల సొమ్మును పక్క రాష్ట్రాల్లో రైతులకు పరిహారంగా అందించడం ఏంటని ప్రశ్నించారు. నేలకొండపల్లి మండలం నాచేపల్లి సొసైటీ పరిధిలో 20వేల క్వింటాలు వీధుల్లోనే ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్‌ తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. రాబోవు ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రంలో ప్రభుత్వాలను ప్రజలు మార్చాలని కోరారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నగర అధ్యక్షుడు ఎండీ జావీద్‌, నాయకులు మొక్కా శేఖర్‌గౌడ్‌, వీరభద్రం, కరుణాకర్‌రెడ్డి, మలీదు వెంకటేశ్వర్లు, హుస్సేన్‌, అంజయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని