logo

జులై నుంచి ఆయిల్‌పాం మొక్కల పంపిణీ

ఆయిల్‌పాం మొక్కల పంపిణీ జులై నుంచి ప్రారంభమవుతుందని ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మల్లారం, దమ్మపేట గ్రామాల్లో ఆయిల్‌పాం తోటలను యాదాద్రి

Published : 25 May 2022 01:44 IST

తోటలను పరిశీలిస్తున్న ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు

దమ్మపేట, న్యూస్‌టుడే: ఆయిల్‌పాం మొక్కల పంపిణీ జులై నుంచి ప్రారంభమవుతుందని ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మల్లారం, దమ్మపేట గ్రామాల్లో ఆయిల్‌పాం తోటలను యాదాద్రి భువనగిరి జిల్లా రైతులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆయిల్‌పాం సాగు, యాజమాన్య పద్ధతులను తెలియజేశారు. అప్పారావుపేట పామాయిల్‌ పరిశ్రమ పనితీరును రైతులకు వివరించారు. ప్రాంతీయ మేనేజర్‌ ఉదయ్‌కుమార్‌, కర్మాగార మేనేజర్‌ కల్యాణ్‌, చౌటుప్పల్‌ ఎంపీపీ వెంకటరెడ్డి, సహకార సంఘ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, కర్మాగార సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని