logo

నేడు హనుమజ్జయంతి వేడుక

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దేవదేవుణ్ని దర్శించుకుని ప్రణమిల్లారు.

Published : 25 May 2022 01:44 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దేవదేవుణ్ని దర్శించుకుని ప్రణమిల్లారు. శ్రీసీతారామలక్ష్మణ దర్శనంతో మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ప్రధాన ఆలయంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చనలు చేశారు. బేడా మండపంలో క్షేత్ర విశిష్టతను వైదిక పెద్దలు ప్రవచనం చేశారు. విష్వక్సేన పూజ కొనసాగించి పుణ్యాహ వాచనం నిర్వహించారు. సీతమ్మకు యోక్త్రధారణ రామయ్యకు యజ్ఞోపవీత ధారణ జరిగింది. మాంగళ్యధారణ రమణీయంగా కనిపించగా తలంబ్రాల వేడుక పరమానందమైంది. దర్బారు సేవ తన్మయత్వాన్ని నింపింది. హనుమజ్జయంతి వేడుకల్లో రెండో రోజున అంజన్నకు అభిషేకం నిర్వహించి సుందరకాండ పారాయణం చేశారు. భక్తులు తమలపాకులు సమర్పించి మొక్కులు చెల్లించారు. నేడు హనుమజ్జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఉంటాయని వైదిక పెద్దలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని