logo

జిల్లా కేంద్రాల్లోనే సార్వత్రిక పరీక్షలు

తెలంగాణ సార్వత్రిక విద్యాలయం(ఓపెన్‌ స్కూల్‌) పదో తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ఈనెల 31 నుంచి నిర్వహించనున్నారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు

Updated : 25 May 2022 01:46 IST

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: తెలంగాణ సార్వత్రిక విద్యాలయం(ఓపెన్‌ స్కూల్‌) పదో తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ఈనెల 31 నుంచి నిర్వహించనున్నారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జిల్లా కేంద్రాల్లోనే పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు ఖమ్మం నగరంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కొత్తగూడెం పట్టణంలో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం డీఈవో ఎస్‌.యాదయ్య, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ మద్దినేని పాపారావు తెలిపారు.

అభ్యర్థులకు తప్పని ఇబ్బందులు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరీక్షలు రాసేందుకు వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. కేవలం జిల్లా కేంద్రాల్లో మాత్రమే కేంద్రాలను ఏర్పాటు చేయటం వల్ల మండు వేసవిలో దూర ప్రాంతాల నుంచి వచ్చేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. జిల్లా కేంద్రాల్లో ఉండి పరీక్షలు రాయాలంటే చాలామందికి వ్యవప్రయాసలతో కూడిన వ్యవహారం. దూరాభారం వల్ల కొంత మంది పరీక్షలు రాసేందుకు కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని