logo

నాలుగు దిశల్లో ముదింపు

పట్టణాల్లో ఉత్పత్తవుతున్న వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం, వాహనాల ద్వారా తరలించడం, యంత్రాలను ఉపయోగించి పునర్వినియోగించడం.. ఇలా వ్యర్థాలకు అర్థం కల్పిస్తూ ఆదాయంగా మలుస్తున్నారు. పౌరుల భాగస్వామ్యంతో పట్టణ పారిశుద్ధ్యం మెరుగుపర్చడం,

Published : 26 May 2022 03:26 IST

 స్వచ్ఛ సర్వేక్షణ్‌ నియమావళి విడుదల

పాల్వంచలో తడివ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువు తయారీ కేంద్రం

కొత్తగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: పట్టణాల్లో ఉత్పత్తవుతున్న వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం, వాహనాల ద్వారా తరలించడం, యంత్రాలను ఉపయోగించి పునర్వినియోగించడం.. ఇలా వ్యర్థాలకు అర్థం కల్పిస్తూ ఆదాయంగా మలుస్తున్నారు. పౌరుల భాగస్వామ్యంతో పట్టణ పారిశుద్ధ్యం మెరుగుపర్చడం, ఆహ్లాద వాతావరణాన్ని కల్పిస్తున్న సంస్థలకు కేంద్రం ర్యాంకులు, అవార్డులు, నగదు ప్రోత్సహాకాన్ని అందజేస్తోంది. 2016 నుంచి కేంద్రం స్వచ్ఛసర్వేక్షణ్‌ పేరుతో కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తోంది. ఏటా కేంద్ర బృందాలు స్థానిక సంస్థల పనితీరును గుర్తిస్తున్నాయి. తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023 టూల్‌కిట్‌ను దిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి మనోజ్‌జోషి ఇటీవల విడుదల చేశారు. 2023లో ఆర్‌ఆర్‌ఆర్‌(రెడ్యూస్‌ రీసైకిల్‌ రీయూజ్‌)కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సర్వేల్లో మూడు దశలుండగా తాజాగా నాలుగు దశల్లో మదిస్తారు.
ఈసారి ఆర్‌ఆర్‌ఆర్‌కే ప్రాధాన్యం
స్వచ్ఛసర్వేక్షణ్‌ ఒక్కో ఏడాది ఒక్కో అంశాన్ని లక్ష్యంగా చేసుకుని పనులను నిర్దేశిస్తున్నారు. గతేడాది సామాజిక, బహిరంగ మరుగుదొడ్ల నిర్మాణం, తడి, పొడి వ్యర్థాలను వేరు చేయడం వంటి అంశాలను లక్ష్యంగా ఉంచారు. 2023లో వ్యర్థాలను పునర్వినియోగం చేసి ఆదాయాన్ని ఆర్జిస్తున్న పురపాలికలను గుర్తించనున్నారు. దీనినే ఆర్‌ఆర్‌ఆర్‌(రెడ్యూస్‌ రీయూజ్‌ రీసైకిల్‌)గా పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.


జనాభా ఆధారంగా అవార్డులు
1. 15వేల లోపు  2. 15-25వేల లోపు
3. 25-50వేలు  4. 50-లక్ష వరకు..
5. లక్ష-10లక్షలు



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని