logo

ఉద్యోగార్థుల సన్నద్ధకు సదుపాయాలు: మంత్రి

ఉద్యోగార్థుల కోసం ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకుంటే అందలం మీదేనని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ పాత

Published : 01 Jul 2022 04:43 IST

సిటీ గ్రంథాలయంలో ఉద్యోగార్థులకు రూ.5భోజనం వడ్డిస్తున్న మంత్రి అజయ్‌, నీరజ, తదితరులు

ఖమ్మం నగరపాలకం, రఘునాథపాలెం, న్యూస్‌టుడే: ఉద్యోగార్థుల కోసం ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకుంటే అందలం మీదేనని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ పాత కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిటీ గ్రంథాలయంలో ఉద్యోగార్థులకు రూ.5భోజన సౌకర్యాన్ని గురువారం ప్రారంభించారు. అభ్యర్థుల కోసం నగరపాలక సంస్థ నుంచి నిధులు కేటాయించి భోజనం అందిస్తున్నట్టు వెల్లడించారు. అంతకుముందు 37, 47వ డివిజన్లలో సీసీ రహదారులను ప్రారంభించారు.

కలెక్టరేట్‌ భవనం సందర్శన: మండలంలోని వి.వెంకటాయపాలెంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టరేటు భవన సముదాయాన్ని కలెక్టర్‌ గౌతమ్‌తో కలిసి మంత్రి అజయ్‌ సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు. భవనాన్ని అన్ని వసతులతో సుందరంగా తీర్చిదిద్దాలని, ప్రాంగణంలో ప్లాన్‌ ప్రకారం పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాండురంగాపురంలో కార్పొరేటర్‌ జ్యోతిరెడ్డి ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో మేయర్‌ పునుకొల్లు నీరజ, ఉపమేయర్‌ ఫాతిమాజోహ్రా, సుడా ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌, కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, ఏఎంసీ ఛైర్మన్‌ లక్ష్మీప్రసన్న, ఈఈ శ్యాంప్రసాద్‌, కార్పొరేటర్లు కమర్తపు మురళి, వలరాజు, సిటీ గ్రంథాలయం ఛైర్మన్‌ అశ్రీఫ్‌, తహసీల్దార్లు శైలజ, నరసింహారావు, నాయకులు గుండాల కృష్ణ, పద్మ, ముక్తార్‌, సుగుణారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని