logo

సోనూసూద్‌ సేవలే స్ఫూర్తిగా..

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎందరినో ఆదుకున్న నటుడు సోనూసూద్‌ను ఓ యువకుడు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఖమ్మం నాలుగో డివిజన్‌ అమరావతి నగర్‌కు చెందిన జి.శ్రవణ్‌కుమార్‌ పాండురంగాపురం స్టేజీ వద్ద ఇల్లెందు ప్రధాన రహదారి పక్కన ‘సోనూసూద్‌

Updated : 02 Jul 2022 07:20 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎందరినో ఆదుకున్న నటుడు సోనూసూద్‌ను ఓ యువకుడు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఖమ్మం నాలుగో డివిజన్‌ అమరావతి నగర్‌కు చెందిన జి.శ్రవణ్‌కుమార్‌ పాండురంగాపురం స్టేజీ వద్ద ఇల్లెందు ప్రధాన రహదారి పక్కన ‘సోనూసూద్‌ కూరగాయలు’ దుకాణం ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన శ్రవణ్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేశాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం పోగా వలస కార్మికుల కోసం సోనూసూద్‌ ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట వరకు ప్రయాణించి వచ్చాడు. వలస కార్మికులకు అండగా నిలిచిన సూద్‌కు గుర్తుగా కూరగాయల దుకాణం ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. ఇల్లెందు ప్రధాన రహదారి రెండేళ్ల క్రితం దీన్ని ఏర్పాటు చేశాడు. విక్రయించగా మిగిలిన కూరగాయలను ఖానాపురం పారిశ్రామిక వాడలోని శ్రీదయానంద వృద్ధాశ్రమానికి ప్రతిరోజూ అందజేస్తున్నట్లు తెలిపాడు. - ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని