logo

స్ఫూర్తి నింపిన వజ్రోత్సవ పరుగు

నగరంలో గురువారం జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన ఫ్రీడం రన్‌ ఉత్సాహంగా సాగింది. అన్ని వర్గాల ప్రజలు పరుగులో పాల్గొన్నారు. పటేల్‌ ప్రాంగణంలో సీపీ విష్ణువారియర్‌ క్రీడా జ్యోతిని వెలిగించి అథ్లెట్‌ పవన్‌కుమార్‌ చేతికి అందించి

Published : 12 Aug 2022 01:55 IST

2కె రన్‌లో పాల్గొన్న సీపీ విష్ణు వారియర్‌, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, లక్ష్మీప్రసన్న, విజయ్‌కుమార్‌ తదితరులు

ఖమ్మం క్రీడలు, న్యూస్‌టుడే: నగరంలో గురువారం జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన ఫ్రీడం రన్‌ ఉత్సాహంగా సాగింది. అన్ని వర్గాల ప్రజలు పరుగులో పాల్గొన్నారు. పటేల్‌ ప్రాంగణంలో సీపీ విష్ణువారియర్‌ క్రీడా జ్యోతిని వెలిగించి అథ్లెట్‌ పవన్‌కుమార్‌ చేతికి అందించి లాంఛనంగా రన్‌ను ప్రారంభించారు. పరుగు లకారం ట్యాంక్‌బండ్‌ వద్దకు చేరింది. సీపీ మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాంతంత్య్ర పోరాటాన్ని భావితరాలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, అదనపు కలెక్టర్లు స్నేహలత, మధుసూధన్‌, ఏడీసీపీ శబరీశ్‌, నగర కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, డీఆర్‌వో శిరీష, జిల్లా ఆబ్కారీ అధికారి నాగేంద్రరెడ్డి, డీవైఎస్వో పరంధామరెడ్డి, సుడా ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌ వద్ద భారీ జ్యోతిని సీపీ వెలిగించారు. ఆ తర్వాత పలు శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది స్వీయచిత్రాలు దిగారు.  

ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగరాలి: జిల్లా జడ్జి

ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే: ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలని దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా జడ్జి డా. టి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.  జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన హర్‌ ఘర్‌ తిరంగా ఉద్దేశాన్ని, ఇండియన్‌ ఫ్లాగ్‌ కోడ్‌లను వివరించే రెండు భారీ ఫ్లెక్సీలను న్యాయమూర్తి ఆవిష్కరించి మాట్లాడారు. జాతీయ జెండాను సముచిత రీతిలో అందరూ గౌరవించాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఆర్‌.డేనీరూథ్‌, జి.శ్రీనివాస్‌, జావీద్‌ పాషా, ఎన్‌.శాంతిసోని, పి.మౌనిక, ఈ.భారతి, ఆర్‌.శాంతిలత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.రామారావు, జిల్లా కోర్టు పరిపాలనాధికారి ఎ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యాయశాఖ ఉద్యోగులకు జాతీయ జెండాలు పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని